West Indies: వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో వెస్టిండీస్ ఓటమికి ప్రధాన కారణాలివే..?
వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023 సూపర్ సిక్స్ మ్యాచ్‌లో వెస్టిండీస్ (West Indies) జట్టు స్కాట్లాండ్‌తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
- By Gopichand Published Date - 06:55 AM, Sun - 2 July 23

West Indies: వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2023 సూపర్ సిక్స్ మ్యాచ్‌లో వెస్టిండీస్ (West Indies) జట్టు స్కాట్లాండ్‌తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. స్కాట్లాండ్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ ఓటమితో వెస్టిండీస్ జట్టు వన్డే ప్రపంచకప్‌కు దూరమైంది. వన్డే ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు ఆడకపోవడం ఇదే తొలిసారి. వెస్టిండీస్ రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. స్కాట్లాండ్‌పై వెస్టిండీస్ ఓటమి వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో బ్యాటింగ్ ఒక ముఖ్యమైన కారణం.
స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 181 పరుగులకు ఆలౌటైంది. వెస్టిండీస్ ఓటమికి ఇదే ప్రధాన కారణం. ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ పూర్తిగా పరాజయం పాలైంది. ఓటమికి మూడు ప్రధాన కారణాలలో ఒకటి ఫ్లాప్ ఓపెనింగ్. ఓపెనర్ బాండన్ కింగ్ 22 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా ఖాతా తెరవకుండానే చార్లెస్ ఔటయ్యాడు. దీని తర్వాత వెంటనే బ్రూక్స్ కూడా సున్నా వద్ద ఔట్ అయ్యాడు. జట్టు మిడిల్ ఆర్డర్ కూడా పరాజయం పాలైంది. 13 పరుగుల వద్ద కెప్టెన్ షాయ్ హోప్ ఔటయ్యాడు. 5 పరుగుల వద్ద కైల్ మేయర్స్ ఔటయ్యాడు.
వెస్టిండీస్ ఓటమికి మరో ముఖ్యమైన కారణం బౌలింగ్ ప్రదర్శన. జట్టుకు హోల్డర్ తొలి వికెట్ ని తీశాడు. అతను స్కాట్లాండ్ ఓపెనర్ క్రిస్టోఫర్ మెక్‌బ్రైడ్‌ను సున్నా వద్ద అవుట్ చేశాడు. అయితే దీని తర్వాత ఏ బౌలర్ క్రాస్, మెక్‌ముల్లెన్ జోడీని సమయానికి విడదీయలేకపోయారు. 69 పరుగుల వద్ద మెక్‌ముల్లెన్ ఔటయ్యాడు. 8 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. కాగా క్రాస్ నాటౌట్‌గా నిలిచాడు. 7 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేశాడు.
వెస్టిండీస్ ఓటమికి మూడో ముఖ్యమైన కారణం జట్టు మొత్తం ప్రదర్శన. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాళ్లు 100 శాతం రాణించలేకపోయారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు మిస్ ఫీల్డ్ చేయడంతోపాటు క్యాచ్ లను కూడా వదులుకున్నారు. అయితే ఓటమి అనంతరం జట్టు కెప్టెన్ షాయ్ హోప్ ఆటగాళ్లను విమర్శించాడు. మిస్ ఫీల్డ్ క్యాచ్‌లు, మిస్ ఫీల్డ్‌లు మ్యాచ్‌లో భాగమని చెప్పాడు. కానీ మేము ఎల్లప్పుడూ 100 శాతం ప్రయత్నించలేదని నేను అనుకుంటున్నానని అన్నాడు.