Dinesh Karthik Shot: దినేశ్ కార్తీక్ కొట్టిన షాట్ చూసి….నోరెళ్లబెట్టిన కోహ్లీ, కేఎల్ రాహుల్..!!
ఈమధ్య కాలంలో ఐపీఎల్ మ్యాచుల్లో కొన్ని అరుదైన విశేషాలు చోటుసుకుంటున్నాయి. ఆ సమయంలో ఆటగాళ్ల నుంచి ప్రేక్షకుల వరకు వారి హావభావాలను గమనిస్తే...ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది.
- By Hashtag U Published Date - 01:02 PM, Thu - 26 May 22

ఈమధ్య కాలంలో ఐపీఎల్ మ్యాచుల్లో కొన్ని అరుదైన విశేషాలు చోటుసుకుంటున్నాయి. ఆ సమయంలో ఆటగాళ్ల నుంచి ప్రేక్షకుల వరకు వారి హావభావాలను గమనిస్తే…ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది. అలాంటి ఘటనే ఆర్సీబీ, లక్నో జట్ల మధ్య బుధవారం జరిగి మ్యాచ్ లోనూ ఇలాంటిదే ఒకటి చోటుచేసుకుంంది.
ఆర్సీబీ ఆటగాడు దినేష్ కార్తీక్ చాలా సులభంగా కొట్టిన సిక్సర్ షాట్ అటు డగౌట్స్ లో కూర్చున్న విరాట్ కోహ్లీకి…ఇటు మైదానంలో ఉన్న కేఎల్ రాహుల్ అవాక్కయ్యేలా చేసింది. కార్తీక్ కొట్టిన షాట్ కు కోహ్లీ, రాహుల్ ఇద్దరూ నోరెళ్ల బెట్టి చూడటం…ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. వాహ్ అద్భుతం అన్నట్టుగా వారి ముఖాలు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ 17వ ఓవర్లో వరుసగా మూడు బంతులను బౌండరీకి పంపించి దినేశ్ తన బ్యాటింగ్ సత్తా ఏంటో చూపించాడు.
— Guess Karo (@KuchNahiUkhada) May 26, 2022