HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Kohlis Consistency In The Ipl

Virat Kohli: ఐపీఎల్ అంటే రెచ్చిపోతున్న విరాట్ కోహ్లీ.. గ‌ణంకాలు చూశారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విరాట్ కోహ్లీ స్థిరత్వం ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరపున 2008 నుంచి ఆడుతున్న కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు (8,509) సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.

  • Author : Gopichand Date : 17-05-2025 - 4:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat Kohli
Virat Kohli

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విరాట్ కోహ్లీ (Virat Kohli) స్థిరత్వం ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరపున 2008 నుంచి ఆడుతున్న కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు (8,509) సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. 263 మ్యాచ్‌లలో 39.58 సగటు, 132.6 స్ట్రైక్ రేట్‌తో అతని ప్రదర్శన స్థిరత్వానికి నిదర్శనం.

ఐపీఎల్‌లో కోహ్లీ రికార్డులు

కోహ్లీ ఐపీఎల్‌లో 8 సెంచరీలు, 62 అర్ధ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. 2016 సీజన్‌లో 973 పరుగులతో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగుల రికార్డు నెలకొల్పాడు. ఆ సీజన్‌లో 81.08 సగటుతో నాలుగు సెంచరీలు సాధించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆరెంజ్ క్యాప్‌ను 2016, 2024 సీజన్‌లలో గెలుచుకున్న అతను ఎనిమిది సీజన్‌లలో 500+ పరుగులు సాధించి మరో రికార్డు నమోదు చేశాడు. 2025 సీజన్‌లో 11 మ్యాచ్‌లలో 505 పరుగులు, 63.13 సగటు, ఏడు అర్ధ సెంచరీలతో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు.

Virat Kohli's consistency in the IPL. 🤯 pic.twitter.com/7W9YW3j5dG

— Mufaddal Vohra (@mufaddal_vohra) May 17, 2025

కోహ్లీ ప్రతి మ్యాచ్‌ను వరల్డ్ కప్ ఫైనల్‌గా భావిస్తాడు. అతని ఫిట్‌నెస్, టెక్నికల్ డిసిప్లిన్ అతన్ని ఐపీఎల్‌లో అజేయంగా నిలిపాయి. గత 19 ఇన్నింగ్స్‌లలో కేవలం ఒక్కసారి మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్‌కు పరిమితమైన కోహ్లీ.. 2025లో విజయవంతమైన మ్యాచ్‌లలో 95 సగటున పరుగులు సాధించాడు. సామాజిక మాధ్యమాల్లో అతని స్థిరత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌పై 10 50+ స్కోర్లు సాధించి ప్రత్యర్థులపై తన ఆధిపత్యాన్ని చాటాడు.

Also Read: Babar Azam’s World XI: బాబ‌ర్ ఆజం టీ20 వ‌ర‌ల్డ్ జ‌ట్టు ఇదే.. కోహ్లీ, బుమ్రాల‌కు షాక్‌!

2008 నుంచి ఆర్‌సీబీ తరపున ఆడుతున్న కోహ్లీ.. ఫ్రాంచైజీకి అతని విధేయతను నిరూపించాడు. అయితే ఆర్‌సీబీ ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది. అయినప్పటికీ కోహ్లీ ప్రదర్శనలు జట్టుకు బలమైన స్తంభంగా నిలుస్తున్నాయి. అతని నాయకత్వంలో ఆర్‌సీబీ 2016లో ఫైనల్‌కు చేరినప్పటికీ టైటిల్ కల నెరవేరలేదు. విరాట్ కోహ్లీ స్థిరత్వం, అతని ఆటతీరు ఐపీఎల్‌లో ఒక లెజెండ్‌గా నిలిపాయి. 2025 సీజన్‌లోనూ అతని బ్యాట్ అద్బుతంగా ప‌రుగులు రాణిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Centuries
  • Consistency
  • Half Centuries
  • Highest Run Scorer
  • IPL
  • IPL 2025
  • orange cap
  • royal challengers bengaluru
  • virat kohli

Related News

King Kohli Posted An Instag

కోహ్లి రికార్డును అలవోకగా చెరిపేసిన సంజూ శాంసన్

Virat Kohli  2026 టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించగా, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక సందేశంతో అభినందించాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “చెటా” అంటూ శాంసన్‌ను అభినందించిన కోహ్లీ, కీలక సమయంలో అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. ఈ టోర్నమెంట్‌లో ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ శాంసన్ 321 పరుగులు చేసి టోర్నమెంట్ టాప

  • Abhishek Sharma

    ఫైన‌ల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని ఫాలో అయిన అభిషేక్ శ‌ర్మ‌!

  • Sanju Samson

    టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

  • Rohit Sharma-Virat Kohli

    23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

  • IPL 2026

    RCB అభిమానులకు గుడ్ న్యూస్!

Latest News

  • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd