Virat Kohli- Rishabh Pant: ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీ ఆడనున్న విరాట్, పంత్, హర్షిత్ రాణా!
విరాట్ కోహ్లీ తన చివరి రంజీ మ్యాచ్ 2012లో ఆడాడు. యూపీతో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేశాడు. అప్పటి నుంచి కోహ్లీ రంజీ మ్యాచ్‌లు ఆడలేదు.
- By Gopichand Published Date - 06:30 PM, Tue - 14 January 25

Virat Kohli- Rishabh Pant: 2024-25 రంజీ ట్రోఫీ రెండో దశ జనవరి 23 నుంచి ప్రారంభం కానుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైన తర్వాత భారత బ్యాట్స్‌మెన్‌పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మొత్తం సిరీస్‌లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ నుండి కెప్టెన్ రోహిత్ శర్మ వరకు అందరూ నిరాశపరిచారు. ఆ తర్వాత మాజీ క్రికెటర్లు టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించారు. ఇప్పుడు రెండో దశ రంజీ ట్రోఫీకి ఢిల్లీ జట్టును వెల్లడించారు. ఇందులో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హర్షిత్ రాణా పేర్లు కూడా ఉన్నాయి.
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో రెండో దశ కోసం ఢిల్లీ ప్రాబబుల్ స్క్వాడ్‌లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, (Virat Kohli- Rishabh Pant) హర్షిత్ రాణా చేరారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ప్రకటించిన 41 మంది సభ్యుల సంభావ్య జట్టులో ఆయుష్ బడోని, నవదీప్ సైనీ, యష్ ధుల్ కూడా ఉన్నారు. విరాట్ కోహ్లీ తన చివరి రంజీ మ్యాచ్ 2012లో ఆడాడు. యూపీతో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేశాడు. అప్పటి నుంచి కోహ్లీ రంజీ మ్యాచ్‌లు ఆడలేదు.
Also Read: Makar Sankranti: మకర సంక్రాంతి తేదీ ఎందుకు మారుతోంది..?
అయితే కోహ్లీ లేదా పంత్ తమ తరఫున ఆడతారని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కార్యదర్శి అశోక్ శర్మ భావించడం లేదు. ఆయన మాట్లాడుతూ.. విరాట్- రిషబ్ ఇద్దరి పేర్లు సంభావ్య జాబితాలో ఉన్నాయి. రంజీ ట్రోఫీ క్యాంపు జరుగుతోంది. ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాలని బీసీసీఐ కూడా చెప్పింది. విరాట్, రిషబ్ కనీసం ఒక మ్యాచ్ ఆడాలని నేను అనుకుంటున్నాను. కానీ వారు ఆడతారని నేను అనుకోవటంలేదని ఆయన అన్నారు.
🚨 DELHI SQUAD FOR 2ND ROUND IN THIS RANJI TROPHY 2025 🚨
– Virat Kohli & Rishabh Pant in the Squad..!!!! pic.twitter.com/gMcWAUEWj5
— Tanuj Singh (@ImTanujSingh) January 14, 2025
ఢిల్లీకి చెందిన రంజీ జట్టు అంచనా
విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, హర్షిత్ రాణా, ఆయుష్ బడోని, సనత్ సాంగ్వాన్, గగన్ వాట్స్, యష్ ధుల్, అనుజ్ రావత్ (wk), జాంటీ సిద్ధు, సిద్ధాంత్ శర్మ, హిమ్మత్ సింగ్, నవదీప్ సైనీ, ప్రణవ్ రాజ్‌వంశీ (wk), సుమిత్ మాథుర్, మణి గ్రేవాల్ , శివం శర్మ, మయాంక్ గుసేన్, వైభవ్ కంద్పాల్, హిమాన్షు చౌహాన్, హర్ష్ త్యాగి, శివంక్ వశిష్ఠ, ప్రిన్స్ యాదవ్, ఆయుష్ సింగ్, అఖిల్ చౌదరి, హృతిక్ షౌకీన్, లక్ష్య థరేజా (WK), ఆయుష్ దోసెజా, అర్పిత్ రాణా, వికాస్ సోలంకి, సమర్థ్ సేథ్, రౌనక్ వాఘేలా, అనిరుధ్ చౌదరి, రాహుల్ గెహ్లాట్, భగవాన్ సింగ్, మయాంక్ రావత్, తేజస్వీ దహియా, (wk) రాహుల్ దాగర్, ఆర్యన్ రాణా, సలీల్ మల్హోత్రా, జితేష్ సింగ్.