Virat@100: కింగ్ ఈజ్ బ్యాక్
ఆసియాకప్ నామమాత్రపు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
- By Naresh Kumar Published Date - 10:28 PM, Thu - 8 September 22

ఆసియాకప్ నామమాత్రపు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా మూడేళ్ళ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించాడు. చాలా కాలంగా ఫామ్‌లో లేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ ఈ సిరీస్‌లో గాడిన పడినట్టే కనిపించినా భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో ఆప్ఘన్ టీమ్‌పై తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. 53 బంతుల్లోనే సెంచరీ చేసిన విరాట్ 122 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 6 సిక్సర్లున్నాయి.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్‌శర్మకు రెస్ట్ ఇవ్వడంతో రాహుల్, కోహ్లీ ఓపెనర్లుగా వచ్చారు. దీంతో ఫామ్‌లోకి వచ్చేందుకు కోహ్లీ ఈ మ్యాచ్‌ను చక్కగా ఉపయోగించుకున్నాడు. ఆరంభంలో కాసేపు నిలకడగా ఆడినా తర్వాత గేర్ మార్చాడు. భారీ షాట్లతో రెచ్చిపోయాడు. స్టేడియం నలువైపులా బౌండరీలు బాదేస్తూ ఒకప్పటి కోహ్లీని గుర్తుకు తెచ్చాడు. ఈ క్రమంలో 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ తర్వాతి 50 పరుగులు చేసేందుకు 21 బంతులే ఆడాడు. భారీ సిక్సర్లతో అభిమానులను అలరిస్తూ దూకుడుగా ఆడాడు.
The milestone we'd all been waiting for and here it is!
71st International Century for @imVkohli 🔥💥#AsiaCup2022 #INDvAFGpic.twitter.com/hnjA953zg9
— BCCI (@BCCI) September 8, 2022
ఈ క్రమంలో 53 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా 1020 రోజుల తర్వాత కోహ్లీ శతకం సాధించాడు. కాగా సెంచరీ తర్వాత కోహ్లీ గతంతో పోలిస్తే చాలా రిలాక్స్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. తన చేతికి ఉన్న ఉంగరాన్ని ముద్దు పెట్టుకున్నాడు. తన భార్య అనుష్కశర్మ ఇచ్చిన రింగ్‌ను కిస్ చేసిన కోహ్లీ ఆమెకు శతకాన్ని అంకితం చేశాడు. కోహ్లీ విధ్వంసంతో భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్కమించిన భారత్, ఆప్ఘనిస్థాన్‌కు ఇది నామమాత్రపు మ్యాచ్ మాత్రమే. అయితే కోహ్లీ సెంచరీతో ఫామ్‌లోకి రావడంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.