HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Kohli Completes 15 Years Journey In Cricket Know 10 Things About His Career

Kohli – 15 Years – 10 Things : కోహ్లీ 15 ఏళ్ల క్రికెట్ జర్నీ.. 10 ఆసక్తికర విశేషాలు

Kohli - 15 Years - 10 Things :  విరాట్ కోహ్లి.. క్రికెట్ లెజెండ్ గా ఎదిగిన ఒక సామాన్యుడు.. ఇప్పుడు ఆయన అసామాన్యుడు.. కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.. 

  • By Pasha Published Date - 12:01 PM, Fri - 18 August 23
  • daily-hunt
Kohli 15 Years Journey
Kohli 15 Years Journey

Kohli – 15 Years – 10 Things :  విరాట్ కోహ్లి.. క్రికెట్ లెజెండ్ గా ఎదిగిన ఒక సామాన్యుడు..

ఇప్పుడు ఆయన అసామాన్యుడు.. కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.. 

సోషల్ మీడియాలో కోహ్లి హవా అంతా ఇంతా కాదు.. 

నంబర్-1 బ్యాట్స్‌మెన్‌గా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆడుగుపెట్టి  15 సంవత్సరాలు గడిచాయి..

ఈసందర్భంగా అతని కెరీర్ తో ముడిపడిన 11 ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం.. 

Also read : Air India ✈ : ₹.1,470/- కి ఎయిర్ ఇండియా విమాన టికెట్.. ప్రయాణికులకు బంపరాఫర్

1. 2008 ఆగస్టు 18న అరంగేట్రం 

విరాట్ కోహ్లీ 2008 ఆగస్టు 18న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్ లోకి  అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో విరాట్ ఓపెనింగ్‌లో 12 రన్స్ కే ఔటయ్యాడు. కానీ దీని తర్వాత.. గత  15 ఏళ్లలో బ్యాటింగ్‌లో ఎన్నో పెద్ద రికార్డులను బద్దలు కొట్టాడు. 20-20 మ్యాచ్ లలో అతని రికార్డు సాటిలేనిది.

2. 15 ఏళ్లలో 510 కిలోమీటర్ల పరుగు 

విరాట్ కోహ్లీ తన 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో 22 గజాల పిచ్‌ల మధ్య 510 కిలోమీటర్ల దూరం పరుగెత్తి రన్స్ చేశాడు. బౌండరీలు, సిక్స్ లు మినహా ఇతర షాట్‌ లు కొట్టి రన్స్ కోసం వికెట్ల మధ్య దాదాపు 277 కిలోమీటర్ల దూరం పరుగెత్తాడు. తన తోటి బ్యాట్స్ మెన్ తో కలిసి 233 కిలోమీటర్ల దూరం పరుగెత్తాడు .

3. బాల్ వేయకుండానే వికెట్ తీశాడు 

టీ20లో లీగల్ గా బాల్ వేయకుండానే విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. 2011లో అతను T20లోతన మొదటి బంతికే కెవిన్ పీటర్సన్‌ను స్టంపౌట్ చేశాడు. అయితే ఆ బాల్ వైడ్‌. అందుకే బాల్ వేయకుండానే వికెట్ తీయగలిగాడు. పురుషుల క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనైనా జియోర్త్ (Zeorth) బాల్‌తో వికెట్ తీసిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ(Kohli – 15 Years – 10 Things) మాత్రమే.

4. 83 వేదికలు.. 46 సెంచరీలు 

కోహ్లీ 83 వేదికలపై మ్యాచ్‌లు ఆడి 46 సెంచరీలు చేశాడు. ఈవిషయంలో సచిన్ టెండూల్కర్ మాత్రమే అతని కంటే ముందున్నాడు. టెండూల్కర్ 53 వేర్వేరు వేదికలపై సెంచరీలు సాధించాడు. కోహ్లీ తన 76 అంతర్జాతీయ సెంచరీలలో 5 సెంచరీలను ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఓవల్ మైదానంలో చేశాడు.

Also read : CTET Exam: సీ-టెట్ రాస్తున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి..!

5. టార్గెట్ ఛేజింగ్‌లో హీరో

టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి ఆట అదుర్స్ అనిపించింది. 2014, 2016లలో జరిగిన  T20 ప్రపంచ కప్‌లలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. అతడు టార్గెట్  ఛేజింగ్‌లలో అత్యుత్తమ రికార్డును కలిగి ఉన్నాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసిన 10 మ్యాచుల్లో 9 భారత్ గెలిచింది. ఇందులో విరాట్ 8 పర్యాయాలు నాటౌట్‌గా నిలవడం విశేషం. ఈ 10 మ్యాచ్‌ల్లో కోహ్లి సగటు  రన్ రేట్  270.

6. విదేశాల్లోనూ సెంచరీలతో హవా 

కోహ్లి 9 దేశాలపై వన్డేలు ఆడగా.. అన్నింటిపై సెంచరీ కొట్టాడు. టెస్టు క్రికెట్‌లో 8 దేశాలపై  ఆడగా.. 7 దేశాలపై సెంచరీ కొట్టాడు. కానీ బంగ్లాదేశ్‌ పై 100 రన్స్ చేయలేకపోయాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ టూర్ కు ఇండియా టీమ్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన  టెస్టులు, ODIలలో కోహ్లి సెంచరీలు బాదాడు. ఈ రికార్డు కలిగిన మరో ఇద్దరు ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర (శ్రీలంక) మాత్రమే.

7. 10 వన్డే ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు 

2018లో ఫిబ్రవరి – అక్టోబర్ మధ్య కోహ్లీ 10 వన్డే ఇన్నింగ్స్‌లలో దాదాపు 1000 పరుగులు చేశాడు. కోహ్లీ తన 197వ మ్యాచ్ నుంచి 206వ మ్యాచ్ మధ్య 142 పరుగుల  సగటు రన్ రేట్ తో 5 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో మొత్తం  995 పరుగులను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. 10 వన్డే ఇన్నింగ్స్‌లలో ఏ బ్యాట్స్‌మెన్‌కైనా ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2016 అక్టోబరు నుంచి 2017 జూన్ మధ్య డేవిడ్ వార్నర్ 857 పరుగుల రికార్డును నెలకొల్పగా, కోహ్లీ  దాన్ని బద్దలు కొట్టాడు.

8. 52 బంతుల్లోనే సెంచరీ 

2013లో ఆస్ట్రేలియాతో జరిగిన జైపూర్ వన్డేలో విరాట్ కోహ్లీ కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వన్డేల్లో భారత్‌కు ఇదే వేగవంతమైన సెంచరీ. ఈ సిరీస్‌లోనే నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్ లో 61 బంతుల్లో సెంచరీ కొట్టాడు. వన్డేల్లో భారత్‌కు ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 30వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. దీంతో 25 ఓవర్ల తర్వాత వన్డేల్లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. కెవిన్ పీటర్సన్, అబ్దుల్ రజాక్, జాకబ్ ఓరమ్ ఒకసారి ఇలా చేశారు.

Also read : WhatsApp Feature – HD Photos : వాట్సాప్‌లో ఇక HD ఫొటోలు సెండ్ చేసే ఫీచర్

9. 33 ఇన్నింగ్స్‌ లు 9 సెంచరీలు

వన్డేల్లో ఇండియా టీమ్ 300 పరుగులకుపైగా లక్ష్యాన్ని ఛేదించే సమయంలో విరాట్ కోహ్లీ అత్యధిక సెంచరీలు కొట్టాడు. ఇటువంటి 33 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ  9 సెంచరీలు చేశాడు.

10. 19 ఏళ్ల 287 రోజుల వయసులో 

విరాట్ కోహ్లీ 19 ఏళ్ల 287 రోజుల వయసులో 2008లో అంతర్జాతీయ క్రికెట్ లోకి  అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను ఓపెనింగ్ బ్యాటింగ్  చేసి, పురుషుల ODIలో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా రికార్డును సాధించాడు. ఈ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 10 Things About Kohli
  • cricket
  • Kohli - 15 Years - 10 Things
  • Kohli-15 Years Journey
  • virat kohli

Related News

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal: అరుదైన ఘ‌న‌త సాధించిన య‌శ‌స్వి జైస్వాల్‌!

యశస్వి జైస్వాల్ చివరిసారిగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియా తరఫున ఆడుతూ కనిపించారు. ఆయన ఆసియా కప్ 2025 కోసం ఎంపిక కాలేదు. ఇప్పుడు జైస్వాల్ స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో ఆడనున్నారు.

  • Women World Cup Cricket Pak

    Ind Vs Pak : మళ్లీ పాక్తో తలపడనున్న భారత్

  • Icc Women's World Cup 2025

    Icc Womens World Cup : ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 షెడ్యూల్

  • Virat Kohli

    Virat Kohli: రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన విరాట్ కోహ్లీ!

Latest News

  • RBI Monetary Policy: ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష.. వృద్ధి అంచనాలు పెంపు, రెపో రేటులో మార్పు లేదు!

  • Onion Prices: ఉల్లి ధ‌ర‌లు ఢ‌మాల్.. కిలో ధ‌ర ఎంతంటే?

  • Cough Syrup: ద‌గ్గు మందు తాగి ఆరుగురు చిన్నారులు మృతి.. ఎక్క‌డంటే?

  • Abhishek Sharma: అభిషేక్ శర్మ సంచలనం.. ICC T20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ రికార్డు!

  • YS Sharmila: కూటమి ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు!

Trending News

    • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

    • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

    • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

    • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

    • India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd