Air India ✈ : ₹.1,470/- కి ఎయిర్ ఇండియా విమాన టికెట్.. ప్రయాణికులకు బంపరాఫర్
బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 లోపు ప్రయాణించాల్సి ఉంటుందని ఎయిర్ ఎండియా (Air India) తెలిపింది.
- By Maheswara Rao Nadella Published Date - 11:32 AM, Fri - 18 August 23

Bumper Offer to Passengers : విమానాయన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. 96 గంటల ఈ ఆఫర్ లో భాగంగా ఎలాంటి ఇతర సౌకర్య రుసుము లేకుండా ప్రారంభ టికెట్టు ధరను సంస్థ రూ.1,470గా నిర్ణయించింది. రూ.10, 130కే బిజినెస్ క్లాస్ టికెట్ కొనుగోలు చేయవచ్చని ఎయిరిండియా తెలిపింది. దేశీయ, ఎంపిక చేసిన అంతర్జాతీయ రూట్లకు కూడా ఈ ఆఫర్ వర్తింస్తుందని వెల్లడించింది. 17న మొదలైన ఆఫర్ ఆదివారం అర్ధరాత్రి 11.59 నిమిషాలకు ముగుస్తుంది.
బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 లోపు ప్రయాణించాల్సి ఉంటుందని ఎయిర్ ఎండియా (Air India) తెలిపింది. ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ (airindia.com), మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చునని ఎయిరిండియా కంపెనీ వర్గాలు తెలిపాయి. వచ్చే పండగ సీజన్‌లో తక్కువకే విమాన ప్రయాణం చేయాలనుకునేవారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబుల్ లాయల్టి బోనస్ పాయింట్లు కూడా పొందవచ్చునని ఎయిరిండియా తెలిపింది.
Also Read: Tickets Prices Revealed: నిమిషాల్లో అమ్ముడైన ఇండియా- పాక్ మ్యాచ్ టిక్కెట్లు..!