Nagpur Pitch Report: తొలి వన్డేకు వర్షం ముప్పు? నాగ్‌పూర్ వెదర్ అప్డేట్ ఇదే!
2019 సంవత్సరం తర్వాత భారత జట్టు తొలిసారిగా నాగ్‌పూర్ మైదానంలో ఆడనుంది. ఇక్కడి పిచ్ స్పిన్ బౌలర్లకు సహాయకరంగా ఉంటుంది.
- By Gopichand Published Date - 06:22 PM, Tue - 4 February 25

Nagpur Pitch Report: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో (Nagpur Pitch Report) జరగనుంది. ఈ సిరీస్ ద్వారా భారత్, ఇంగ్లండ్‌లు ఛాంపియన్స్ ట్రోఫీకి తమ సన్నాహాలను మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ని 4-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. ఫిబ్రవరి 6న నాగ్‌పూర్ వాతావరణం ఎలా ఉంటుంది? తొలి వన్డేకు వర్షం ఆటంకం ఉందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వాతావరణం ఎలా ఉంటుంది?
నాగ్‌పూర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అక్యూ వెదర్ నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 6న ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. తేమ 41 శాతంగా అంచనా వేస్తున్నారు. వర్షం పడే అవకాశం 0 శాతం ఉంది. నాగ్‌పూర్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. రోజులో ఎక్కువ సమయం ఎండగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో వర్ష ప్రభావం మ్యాచ్‌పై ఉండదు అని తెలుస్తోంది.
Also Read: Karunaratne: 100 టెస్టు మ్యాచ్‌లు ఆడి రిటైర్.. ఆశ్చర్యపరుస్తున్న లంక ఆటగాడి నిర్ణయం!
పిచ్ ఎలా ఉంటుంది?
2019 సంవత్సరం తర్వాత భారత జట్టు తొలిసారిగా నాగ్‌పూర్ మైదానంలో ఆడనుంది. ఇక్కడి పిచ్ స్పిన్ బౌలర్లకు సహాయకరంగా ఉంటుంది. ఈ సిరీస్‌లో భారత జట్టులో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి స్పిన్ బౌలర్లు ఉన్నారు.వారు ఈ పిచ్‌పై బాగా రాణించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి పిచ్ స్పిన్ బౌలర్లకు ఉపయోగపడుతుందని గణంకాలు కూడా చెబుతున్నాయి.
భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా.
ఇంగ్లాండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.