Usain Bolt: ఉసేన్ బోల్ట్ రికార్డును బ్రేక్ చేసిన కుర్రాడు ఎవరు?
డివైన్ ఇహెమ్ బ్రిటన్ నివాసి. అతను 15 ఏళ్ల వయస్సులోనే నిరంతరం రికార్డులను సృష్టిస్తున్నాడు. బద్దలు కొడుతున్నాడు. డివైన్ ఇహెమ్ తన 15 ఏళ్ల వయస్సులో 100 మీటర్ల స్ప్రింట్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు.
- By Gopichand Published Date - 10:59 AM, Fri - 14 February 25

Usain Bolt: జమైకాకు చెందిన ఉసేన్ బోల్ట్ (Usain Bolt) ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రన్నర్‌గా గుర్తింపు పొందాడు. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఉసేన్ 8 సార్లు ఒలింపిక్ పతకాన్ని సాధించాడు. ఇప్పుడు ఉసేన్ బోల్ట్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వ్యక్తిగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్న ఓ యువకుడి గురించి చర్చ జరుగుతోంది. కేవలం 15 ఏళ్లకే ఈ అబ్బాయికి మెరుపు అనే పేరు పెట్టారు. అయితే ఆ బాలుడి టాలెంట్ వల్లే అతనికి ఈ పేరు వచ్చింది.
డివైన్ ఇహెమ్ బ్రిటన్ నివాసి. అతను 15 ఏళ్ల వయస్సులోనే నిరంతరం రికార్డులను సృష్టిస్తున్నాడు. బద్దలు కొడుతున్నాడు. డివైన్ ఇహెమ్ తన 15 ఏళ్ల వయస్సులో 100 మీటర్ల స్ప్రింట్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇహెమ్ ప్రపంచ రికార్డు హోల్డర్ ఉసేన్ బోల్ట్, ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ నోహ్ లీల్స్ (అదే వయస్సు) కంటే వేగవంతమైన సమయాన్ని నమోదు చేశాడు.
Also Read: Shivaratri : మహాశివరాత్రి నాటి నుండి ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..!!
గత ఆగస్టులో 14 ఏళ్ల వయసులో డివైన్ ఇహెమ్ 100 మీటర్ల రేసును 10.30 సెకన్లలో పూర్తి చేసి జూనియర్ అథ్లెటిక్స్‌లో రికార్డు సృష్టించాడు. అదే వయసులో అథ్లెటిక్స్ దిగ్గజం బోల్ట్ రికార్డు 10.57 సెకన్లు అని చాలామందికి తెలియకపోవచ్చు. ఇహేమ్ తన కెరీర్‌లో తన తల్లి న్కిరుకాకు ఎక్కువ క్రెడిట్‌ని ఇచ్చాడు. చరిత్రలో అత్యంత వేగవంతమైన 15 ఏళ్ల బాలుడిగా రికార్డు సృష్టించినప్పుడు తాను నైజీరియాలో ఉన్నానని పేర్కొన్నారు. లాస్ ఏంజిల్స్‌లో జరిగే 2028 ఒలింపిక్ క్రీడలలో డివైన్ ఇహెమ్ తనకు అవకాశం వస్తుందని నమ్ముతున్నాడు.
జమైకా రన్నర్ ఉసేన్ బోల్ట్ స్పీడ్ చూసి ప్రపంచం అవాక్కైంది. చిరుత వేగంతో పరుగెత్తిన ఉసేన్ బోల్ట్ తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. 100 మీటర్ల రేసును రికార్డు సమయంలో పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. 15 ఏళ్ల క్రితం 2009 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బోల్ట్ ఈ రికార్డు సృష్టించాడు. 100 మీటర్ల రేసును 9.58 సెకన్లలో పూర్తి చేయడం ద్వారా బోల్ట్ ఈ రికార్డును నెలకొల్పాడు. ఇప్పుడు చాలా మంది యువ అథ్లెట్లు అతని వేగాన్ని గుర్తు చేస్తున్నారు. నైజీరియాలో జన్మించిన 15 ఏళ్ల బ్రిటిష్ అథ్లెట్ డివైన్ ఇహెమ్ తన వేగంతో రికార్డు సృష్టించాడు. ఈ క్రీడాకారుడు గతేడాది జరిగిన లీ వ్యాలీ అథ్లెటిక్స్ సెంటర్‌లో 100 మీటర్ల రేసును కేవలం 10.30 సెకన్లలో పూర్తి చేశాడు. దీంతో 14 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.