HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >This Is The Final List Of Players For Ipl 2025 Mega Auction

IPL Mega Auction: ఐపీఎల్ 2025 ఆక్షన్ కు ఆటగాళ్ల పైనల్ లిస్ట్ ఇదే!

ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితా విడుదల. మొత్తం 1,574 మంది రిజిస్టర్ చేసుకున్న వారు, అందులో 574 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ జాబితాను ఐపీఎల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసింది. నవంబర్ 24, మధ్యాహ్నం 12:30 గంటలకు వేలం ప్రారంభం.

  • By Kode Mohan Sai Published Date - 03:04 PM, Mon - 18 November 24
  • daily-hunt
Retire From IPL
Retire From IPL

IPL Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలానికి సమయం దగర పడుతుంది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఈ వేలం జరగనుంది. ఈ వేలం కోసం అన్ని ఫ్రాంఛైజీలు కూడా సిద్ధమయ్యాయి. మొత్తంగా 1,574 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 320 మంది క్యాప్డ్ ఆటగాళ్లు కాగా, 1,224 మంది అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు ఉన్నారు. అలాగే, అసోసియేట్ దేశాలకు చెందిన 30 మంది క్రికెటర్లు కూడా ఈ వేలం కోసం రిజిస్టర్ అయ్యారు. మొత్తం 1,574 క్రికెటర్లలో, ఫ్రాంఛైజీలు గరిష్టంగా 204 మందిని మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

షార్ట్‌లిస్ట్‌ జాబితా విడుదల:

వేలానికి గడువు సమీపించడంతో, ఐపీఎల్ పాలకమండలి రిజిస్టర్ చేసిన ఆటగాళ్ల నుంచి షార్ట్‌లిస్ట్‌ను ప్రకటించింది. ఫ్రాంఛైజీల ఆసక్తి, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ జాబితా తయారు చేయబడింది. మొత్తం 1,574 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నప్పటికీ, వారిలో 574 మందిని మాత్రమే షార్ట్‌లిస్ట్‌ చేశారు. ఈ 574 మంది ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ పాలకమండలి సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

🚨 NEWS 🚨

TATA IPL 2025 Player Auction List Announced!

All the Details 🔽 #TATAIPLhttps://t.co/QcyvCnE0JM

— IndianPremierLeague (@IPL) November 15, 2024

షార్ట్‌లిస్ట్‌లో 574 ఆటగాళ్లు:

షార్ట్‌లిస్ట్‌లో చోటు సాధించిన 574 మంది క్రికెటర్లలో, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు గరిష్టంగా 204 మందిని మాత్రమే ఎంపిక చేసుకోవచ్చునని తెలుస్తోంది. ఈ ఎంపికలో 70 మంది విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. తుది జాబితాలో భారత క్యాప్‌డ్ ప్లేయర్లు 48 మంది, విదేశీ క్యాప్‌డ్ ప్లేయర్లు 193 మంది, అన్‌క్యాప్‌డ్ భారత ఆటగాళ్లు 318 మంది, విదేశీ అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు 12 మంది ఉన్నారు. అలాగే, ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా ఈ వేలంలో పాల్గొననున్నారు.

ఆటగాళ్ల బేస్‌ ప్రైజ్‌ లిస్టు విడుదల:

వేలానికి నమోదు చేసిన ఆటగాళ్ల బేస్‌ ప్రైజ్‌పై 8 స్లాట్లు ఖరారు చేయబడ్డాయి. అందులో గరిష్ట బేస్‌ ప్రైజ్ రూ. 2 కోట్లు కాగా, కనిష్ట బేస్‌ ప్రైజ్ రూ. 30 లక్షలు. రూ. 2 కోట్ల కనిష్ట ధరతో 81 మంది ఆటగాళ్లు వేలంలోకి వస్తున్నారు. మరోవైపు, రూ. 30 లక్షల కనిష్ట ధరతో అత్యధికంగా 320 మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొననున్నారు.

Capped And Uncapped Players

Capped And Uncapped Players

నవంబర్ 24న ప్రారంభం:

ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం, నవంబర్ 24న మధ్యాహ్నం 12:30 గంటల నుండి ఈ వేలం ప్రారంభమవుతుంది. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి ప్రముఖ ఆటగాళ్లు వేలంలోకి రాబోతున్నందున, వారిని ఎవరు తమ జట్టులో చేర్చుకుంటారనే విషయంపై ఆసక్తి పెరిగింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Indian Premier League (IPL)
  • IPL 2025 Shortlist Players
  • IPL Mega Auction 2025
  • IPL Mega Auction Date & Time Announced

Related News

    Latest News

    • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

    • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

    • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

    • Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

    • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd