HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >These Are Vaibhav Suryavanshis Records

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ రికార్డులు ఇవే!

  • Author : Vamsi Chowdary Korata Date : 01-06-2026 - 12:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
These are Vaibhav Suryavanshi's records.
These are Vaibhav Suryavanshi's records.

ఈ ఏడాది ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచ్‌లు ఆడి 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఒక సెంచరీతో పాటు ప్లే ఆఫ్స్‌లో 97, 96 పరుగులతో అద్భుతంగా రాణించాడు. క్వాలిఫైయర్ 2లో గుజరాత్‌పై ఆడిన ఇన్నింగ్స్‌కి లెజెండరీ క్రికెటర్లంతా ఫిదా అయ్యారు. 15 ఏళ్ల వయస్సులోనే ఇంత బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఎలా ఆడాడంటూ ఆశ్చర్యపోయారు. 63 ఫోర్లతో పాటు 72 సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డును ఊదేశాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో పరుగుల సునామీ సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. రికార్డులతో పాటు కాసుల వర్షంలోనూ మునిగిపోయాడు. కేవలం బ్యాట్‌తోనే కాకుండా సంపాదనలోనూ ఈ బిహార్ కుర్రాడు భళా అనిపించాడు. వేలం పాటలో కేవలం రూ.కోటి పైచిలుకు ధరకే దక్కిన ఈ పరుగుల వీరుడు ఈ ఒక్క సీజన్ ద్వారానే ఏకంగా రూ.రెండున్నర కోట్లకు పైగా ఆర్జించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మ్యాచ్ ఫీజే ఎక్కువ
మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రూ.1.10 కోట్ల వార్షిక రిటైనర్ ఫీజుకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అయితే అతడికి లభించిన అసలు సంపాదన దీనికంటే చాలా ఎక్కువ. ఐపీఎల్‌లో ఆడే ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐ రూ.7.5 లక్షల మ్యాచ్ ఫీజును అందిస్తోంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ మొత్తం 16 మ్యాచ్‌లు ఆడాడు. దీనివల్ల కేవలం మ్యాచ్ ఫీజు రూపంలోనే ఈ కుర్రాడు ఏకంగా రూ.1.20 కోట్లు సంపాదించడం విశేషం.

అవార్డులతో కాసుల వర్షం
రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరకపోయినప్పటికీ.. అహ్మదాబాద్‌లో జరిగిన ప్రజెంటేషన్ సెర్మనీలో వైభవ్ అవార్డులను ఊడ్చేశాడు. ఈ సీజన్ ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ సహా పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకొని భారీగా నగదు బహుమతులను అందుకున్నాడు. ఆ వివరాలు చూస్తే:

  • మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్: రూ.15 లక్షలు
  • ఆరెంజ్ క్యాప్ (టాప్ స్కోరర్ – 776 పరుగులు): రూ.10 లక్షలు
  • సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: రూ.10 లక్షలు (దీనితో పాటు టాటా సియెర్రా కార్)
  • సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ (72 సిక్సర్లు): రూ.10 లక్షలు
  • ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: రూ.10 లక్షలు

మ్యాచ్ డే ప్రైజ్ మనీ అదనం
ఈ అవార్డులతో పాటు ప్రతి మ్యాచ్‌లోనూ వైభవ్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇచ్చే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ది మ్యాచ్’ వంటి వ్యక్తిగత అవార్డులను ఈ సీజన్లో అనేకసార్లు గెలుచుకున్నాడు. వీటి ద్వారా ప్రతిసారీ రూ.1 లక్ష చొప్పున అదనపు నగదు బహుమతులను తన ఖాతాలో వేసుకున్నాడు.

మొత్తం సంపాదన
ఇలా వార్షిక కాంట్రాక్ట్ ఫీజు రూ.1.10 కోట్లు, మ్యాచ్ ఫీజు రూ.1.20 కోట్లు, ప్రజెంటేషన్ సెర్మనీలో వచ్చిన రూ.55 లక్షల అవార్డు మనీ, మ్యాచ్ డే ప్రైజ్ మనీ.. అన్నీ కలిపితే వైభవ్ మొత్తం సంపాదన రూ.2.50 కోట్ల మార్కును దాటేసింది. ఇతర సీనియర్లతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ.. 15 ఏళ్ల వయసులో ఇంత మొత్తం సంపాదించడం అంటే మామూలు విషయం కాదు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Indian Premier League 2026
  • IPL
  • IPL Cricket News
  • Most Valuable Player (MVP)
  • orange cap
  • rajasthan royals
  • Telugu Cricket News
  • Vaibhav Suryavanshi

Related News

Cricket board responds to the altercation between Vaibhav Suryavanshi and Vishen Halambage; heavy fine imposed on the Sri Lankan cricketer.

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ, విషెన్ హలంబగే గొడవపై స్పందించిన క్రికెట్‌ బోర్డు.. శ్రీలంక క్రికెటర్‌కే భారీ జరిమానా

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో మైదానంలో ఘర్షణకు దిగిన శ్రీలంక ‘ఏ’ ఆటగాడు విషెన్ హలంబగేపై ఆ దేశ క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రకాశ్ అందించిన అంపైర్ల నివేదిక ఆధారంగా హలంబగేకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఐసీసీ తరహాలో ఎలాంటి అధికారిక విచారణలు నిర్వహించకుండానే లంక బోర్డు నేరుగా ఈ శిక్ష ఖరారు చ

  • Tilak Varma's argument with umpires... Players clashed after the match ended.

    Tilak Varma: అంపైర్లతో తిలక్‌ వర్మ గొడవ.. మ్యాచ్ ముగిశాక కొట్టుకున్న ప్లేయర్స్

Latest News

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd