HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >These Are The Reasons For Team India Defeat In T20 Match

Team India T20 Series : భారత్ ఓటమికి కారణాలు ఇవే

శ్రీలంకతో టీ ట్వంటీ (T20) సీరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి టీ ట్వంటీలో గెలుపు అంచుల

  • Author : Naresh Kumar Date : 06-01-2023 - 2:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India Vs Sri Lanka Second T20 Match
India Vs Sri Lanka Second T20 Match

శ్రీలంకతో టీ ట్వంటీ సీరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి టీ ట్వంటీలో గెలుపు అంచుల వరకూ వచ్చిన లంక రెండో మ్యాచ్ లో మాత్రం పుంజుకుని విజయాన్ని అందుకుంది. ఉత్కంఠ పోరులో 16 రన్స్ తేడాతో గెలిచి సీరీస్ సమం చేసింది. ఈ మ్యాచ్ లో విజయం కోసం భారత్ (India) కూడా చివరి వరకూ పోరాడినా ఫలితం లేకపోయింది. నో బాల్స్ , టాపార్డర్ వైఫల్యం టీమిండియా (Team India) ఓటమికి కారణాలుగా చెప్పొచ్చు. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు 7 నోబాల్స్ వేయడం ఓటమిని శాసించింది. ఈ నో బాల్స్ ద్వారా శ్రీలంక అదనంగా 36 పరుగులు చేసింది. గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ ఈ మ్యాచ్ లో తీవ్రంగా నిరాశ పరిచాడు. దీనిలో అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే 5 నోబాల్స్ వేసాడు. ఈ అనవసర పరుగులే టీమిండియా (Team India) ఓటమిని శాసించాయి.

ఇక బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ విఫలమవడం కొంప ముంచింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. వరుస ఓవర్లలో టీమిండియా టాప్-3 వికెట్లను కోల్పోయింది. కాసున్ రజితా వేసిన రెండో ఓవర్‌లో ఇషాన్ కిషన్ క్లీన్ బౌల్డ్ కాగా.. శుభ్‌మన్ గిల్ క్యాచ్ ఔటయ్యాడు. కాసేపటికే అరంగేట్ర ప్లేయర్ రాహుల్ త్రిపాటి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా సిక్స్, ఫోర్‌తో జోరు కనబర్చినా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు.

ఆ తర్వాత అక్షర్ పటేల్, సూర్యకుమార్ అదరగొట్టారు. తక్కువ పరుగులకే వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నారు. వరుసగా మూడు ఓవర్లలో శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు వేగాన్ని పెంచారు. వీరిద్దరి జోరుతో మళ్ళీ భారత్ (India) విజయం సాధించేలా కనిపించింది. కీలక సమయంలో వీరిద్దరూ ఔటవదంతో భారత్ కు ఓటమి తప్పలేదు. చివరి ఓవర్లో విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. భారత్ 5 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒకవేళ టాపర్డర్ లో ఒక్కరయ్యినా ధాటిగా ఆడి ఉంటే టీమిండియా సునాయసంగా గెలిచేది.

Also Read:  West Godavari : సంక్రాంతి కి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ హెచ్చరిక


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • cricket
  • ICC
  • india
  • Match
  • sports
  • Sri Lanka
  • T20

Related News

Bcci Naman Awards 2026 Shubman Gill

శుభమన్ గిల్, హర్షిత్ రాణాకు బీసీసీఐ బెస్ట్ క్రికెటర్ అవార్డు!

Bcci Naman Awards 2026  న్యూఢిల్లీలో జరిగిన బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026 వేడుకలో భారత స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (పాలీ ఉమ్రిగర్ అవార్డు)గా ఎంపికయ్యాడు. 2024-25 సీజన్‌లో అతని అద్భుత ప్రదర్శనకు ఈ గౌరవం దక్కింది. ముఖ్యంగా ఇంగ్లండ్ టూర్‌లో టెస్ట్ సిరీస్‌లో 754 పరుగులు చేసి జట్టుకు నాయకత్వం వహించాడు. మరోవైపు యువ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ అవా

  • Election Dates

    దేశంలో మ‌రోసారి ఎల‌క్ష‌న్స్‌.. 4 రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే!

  • BCCI Naman Awards 2026

    బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్‌మన్ గిల్, స్మృతి మంధాన!

  • Modi Speech

    Crisis : సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు – బిజెపి

  • Kuldeep Yadav Marriage

    కుల్దీప్ యాదవ్ పెళ్లి వేడుకలు.. హాజరుకానున్న కోహ్లీ, రోహిత్!

Latest News

  • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

  • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

  • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

  • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

  • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

Trending News

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd