West Godavari : సంక్రాంతి కి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ హెచ్చరిక
సంక్రాంతి (Sankranti) సీజన్ వచ్చిందంటే చాలు ఏపీ కోస్తా జిల్లాల్లో కోడి పందాల జోరు మొదలవుతుంది.
- Author : Maheswara Rao Nadella
Date : 05-01-2023 - 5:40 IST
Published By : Hashtagu Telugu Desk
సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు ఏపీ కోస్తా జిల్లాల్లో కోడి పందాల జోరు మొదలవుతుంది. ముఖ్యంగా, ఉభయగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో నిర్వహించే కోడి పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారతాయి! కోడి పందాలను ప్రభుత్వాలు ఎప్పుడూ అనుమతించకపోయినా, సంక్రాంతి పండుగ రోజుల్లో ఎక్కడో ఒక చోట పందాలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో, సంక్రాంతి సందర్భగా ఏలూరు, పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లాల్లో కోడి పందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ పేర్కొన్నారు.
కోడి పందాలకు వేదికలు సిద్ధంచేసేవారు, కోడి పందాలకు స్థలాలు ఇచ్చేవారు, కోడికత్తుల తయారీదారులు, పేకాట నిర్వహణదారులను గుర్తించామని, గత 15 రోజుల వ్యవధిలో 1,361 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని ఎస్పీ వివరించారు. పందాల పేరుతో జంతువులను, కోళ్లను హింసించడం నేరమని, ప్రజలు సహకరించాలని కోరారు.
Also Read: Number Plate : స్కూటీ నెంబర్ ప్లేట్ కు మాస్క్ తొడిగిన యువకుడికి 8 రోజుల జైలు శిక్ష