HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >The T20 World Cup Starts From Today

నేటి నుంచి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం..

  • Author : Vamsi Chowdary Korata Date : 07-02-2026 - 9:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Icc T20 World Cup 2026
Icc T20 World Cup 2026

ICC T20 World Cup 2026  భారత్, పాక్ మ్యాచ్‌లతో ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2026 ఇవాళ నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. తొలి రోజు గ్రూప్ – ఏలోని నాలుగు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆరంభ మ్యాచ్ పాకిస్తాన్ – నెదర్లాండ్స్ మధ్య జరగనుండగా, రెండో మ్యాచ్ భారత్ – యూఎస్ఏ మధ్య జరగనుంది. ఉదయం 11 గంటలకు పాక్ – నెదర్లాండ్స్ మ్యాచ్, రాత్రి 7 గంటలకు భారత్ – అమెరికా మ్యాచ్‌కు షెడ్యూల్ ఖరారైంది.

  • ఐసీసీ టీ 20 వరల్డ్‌కప్ ఇవాల్టితో ప్రారంభం
  • తొలి మ్యాచ్ పాకిస్తాన్ – నెదర్లాండ్స్
  • రాత్రి 7 గంటలకు భారత్ – యూఎస్ఏ మ్యాచ్

ఐసీసీ టీ 20 వరల్డ్‌కప్ 2026 నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభం అవుతోంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ వరల్డ్‌కప్‌ ఫిబ్రరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది. మొత్తం నాలుగు గ్రూపులుగా జట్లను విభజించి.. గ్రూప్, సూపర్ 8 ఇలా మ్యాచ్‌లను ఐసీసీ నిర్వహిస్తోంది.

తొలిరోజే భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లు ఉండటం విశేషం. మొదటి రోజు రెండు మ్యాచ్‌లు నిర్వహించేలా ఐసీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఉదయం 11 గంటలకు తొలి మ్యాచ్, రాత్రి 7 గంటలకు రెండో మ్యాచ్ జరగుంది. గ్రూప్‌ ఏలోని జట్లకే తొలి రోజులు మ్యాచ్‌లు జరగనుండటం విశేషం.

పాకిస్తాన్ జట్టు భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించడంతో శ్రీలంక వేదికగా నిర్వహించేలా ఐసీసీ సిద్ధం చేసింది. మరోవైపు శ్రీలంక ఆడే గ్రూప్ మ్యాచ్‌లన్నీ కూడా ఆ దేశం వేదికగానే జరగనున్నాయి. బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వచ్చేందుకు నిరాకరించడంతో టీ20 వరల్డ్‌కప్ నుంచి తొలగించి, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌కు ఐసీసీ అవకాశం ఇచ్చింది.

పాకిస్తాన్ – నెదర్లాండ్స్ మ్యాచ్‌తో ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు శంఖారావం పూరించనున్నారు. కొలంబోలోని ఎస్ఎస్‌సీ గ్రౌండ్‌ వేదికగా ఈ ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. ఉదయం 11 గంటలకు తొలి పోరుకు పాక్ – డచ్ జట్లు సిద్ధమయ్యాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకుని పాకిస్తాన్ మంచి జోష్‌తో ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టింది.

పాకిస్తాన్ ప్లేయింగ్ 11 అంచనా

సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, ఫఖర్ జమాన్ / షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, షాహీన్ షా అఫ్రిది, సల్మాన్ మిర్జా, ఉస్మాన్ తారిక్, అబ్రార్ అహ్మద్.

నెదర్లాండ్స్ ప్లేయింగ్ 11 అంచనా

మైకేల్ లెవిట్, మ్యాక్స్ ఓడౌడ్, కాలిన్ అకర్మన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), బాస్ డి లీడ్, జాక్ లయన్-కాచెట్, లోగన్ వాన్ బీక్, రూలాఫ్ వాన్ డెర్ మెర్వే, కైల్ క్లైన్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకీరెన్.

తొలి రోజు రెండో మ్యాచ్ భారత్ – యూఎస్ఏ మధ్య జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికగా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ అడుగుపెడుతుండగా.. టీ20 వరల్డ్‌కప్ 2024లో సత్తా చాటి మళ్లీ తామేంటో నిరూపించుకునేందుకు యూఎస్ఏ రెడీ అయింది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

టీమిండియా జట్టు అంచనా

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

యూఎస్ఏ జట్టు అంచనా

మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆండ్రీస్ గౌస్ (వికెట్ కీపర్), సాయితేజ ముక్కమల్ల, షయాన్ జహంగీర్, మిలింద్ కుమార్, శుభమ్ రంజనే, హర్మీత్ సింగ్, మొహమ్మద్ మొహ్సిన్, అలీఖాన్, నోస్తుష్ కెన్జిగే, సౌరభ్ నేత్రవల్కర్.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2026 T20 World Cup
  • ICC Cricket News
  • ICC T20 World Cup 2026
  • IND vs USA
  • India Full Schedule
  • Opening Match
  • Pakistan vs Netherlands
  • Team Squads List
  • TeamIndia

Related News

Pakistan PM Shehbaz Sharif Reaffirms Boycott Stance

భారత్‌తో మ్యాచ్‌కు పాక్ దూరం

IND VS PAK  టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో తలపడే విషయంపై  కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెరదించారు. ఫిబ్రవరి 15న శ్రీలంక వేదికగా జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్‌పై ఆయన తన మౌనాన్ని వీడుతూ పాకిస్థాన్ వైఖరిని స్పష్టం చేశారు. బుధవారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయానికి

  • Ms Dhoni

    టీ20 వరల్డ్ కప్ పై ? ఎంఎస్ ధోనీ షాకింగ్ కామెంట్స్..

  • T20 World Cup 2026

    T20 వరల్డ్‌కప్‌కి అంతా సిద్ధం

  • Suryakumar Yadav

    విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

Latest News

  • డ్రై ఫ్రూట్స్ ప్రియులకు పండగే !! అమెరికా ట్రేడ్ డీల్‌తో భారీగా తగ్గనున్న ధరలు!

  • అశ్లీల వీడియోలు చూస్తున్నారా..? అయితే మీరు జైలు పాలైనట్లే !!

  • బాలయ్య సినిమా..కథనే మార్చేసిన గోపీచంద్!

  • వివాహితను ట్రాప్.. గదికి పిలిపించి యువకుడు.. వామ్మో !

  • పొరపాటుగా చేసిన కల్తీ కాదు..కావాలని చేసిన పాపం – ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం

Trending News

    • పాక్‌కు USA షాక్.. పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ భారత్‌దేనంటూ అమెరికా కొత్త మ్యాప్

    • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

    • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd