IPL 2024 : ఐపీఎల్ ఫైనల్‌కు SRH రావడానికి కారణం అదే – VH
హైదరాబాద్ జట్టు రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడి ఆడి ఎక్స్ పర్ట్స్ అవడం వల్లే ఐపీఎల్ ఫైనల్‌కు వచ్చిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
- By Sudheer Published Date - 01:44 PM, Sat - 25 May 24

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతురావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏవిషయమైన..అవతలి వ్యక్తి ఎవరైనా సరే ఏమాత్రం వెనుకడుగు వెయ్యకుండా ..తన మనసులో ఏది అనిపిస్తే అదే చెప్పేసే వ్యక్తి. అందుకే ఈయన తరుచు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఐపీఎల్ ఫైనల్‌కు చేరిన హైదరాబాద్ జట్టు ఫై కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ జట్టు రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడి ఆడి ఎక్స్ పర్ట్స్ అవడం వల్లే ఐపీఎల్ ఫైనల్‌కు వచ్చిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వీహెచ్ సన్ రైజర్స్‌పై చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక రేపు చెన్నైలోని చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించిన ఫైనల్‌కు దూసుకొచ్చింది SRH. ఫైనల్‌లోనూ అదే జోరు కొనసాగించి.. 8 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది.
Read Also : LS Polls : లోక్‌సభ ఎన్నికల్లో.. పీకే అంచనా నిజమవుతుందా?