HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Telangana Athletes In Asian Games

Telangana : ఏషియన్ గేమ్స్ లో తెలంగాణ క్రీడాకారుల హవా.. అద్భుత విజ‌యాలు సాధించిన నిఖత్‌ జరీన్, అగసర నందిని

ఏషియ‌న్ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారులు తమ స‌త్తా చాటుతున్నారు. ఏషియన్ గేమ్స్ లో భారత బాక్సర్ నిఖత్ జరీన్‌‌,హెప్టాథ్లాన్‌

  • Author : Prasad Date : 01-10-2023 - 11:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nikhar Zareen Cm
Nikhar Zareen Cm

ఏషియ‌న్ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారులు తమ స‌త్తా చాటుతున్నారు. ఏషియన్ గేమ్స్ లో భారత బాక్సర్ నిఖత్ జరీన్‌‌,హెప్టాథ్లాన్‌ క్రీడా విభాగంలో గురుకుల విద్యార్థిని అగ‌స‌ర నందినిలు చెరో కాంస్య పతకం గెలుచుకున్నారు. ఆసియా క్రీడల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె . చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు బిడ్డలు రాష్ట్రం గర్వపడే విజయాలు సాధించారని సీఎం కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ గురు కులాలు ఇప్పటికే విద్యారంగంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో ఆసియా క్రీడల్లో సత్తా చాటడం గొప్ప విషయం అని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర క్రీడాకారులు తెలంగాణ తో పాటు దేశ ఖ్యాతి ని మరో మారు చాటారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ బిడ్డలు తమ ప్రతిభను ప్రదర్శించి పతకాలు సాధించి తెలంగాణకే కాకుండా దేశానికే వన్నె తేవడం సంతోషంగా వుందని సీఎం కేసీఆర్ తెలిపారు. క్రీడాకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఈ ప్రోత్సాహం ఇలాగే కొనసాగుతుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

ఆసియా క్రీడాల్లో తెలంగాణ గురుకుల విద్యార్థిని అగసర నందిని హెప్టాథ్లాన్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణి నందిని. నందిని సంగారెడ్డి లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ లో బిబిఎ (BBA) రెండో సంవత్సరం చదువుతున్నది. నర్సింగి లోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకుంది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ వెల్ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఐనిస్టిట్యూషన్ సొసైటీ అథ్లెటిక్స్ అకాడమీ మొదటి బ్యాచ్ విద్యార్థిని. సాధారణ పేద కుటుంబంలో నందిని జన్మించింది. ఆమె తండ్రి యల్లయ్య చాయ్ అమ్ముతూ తన కూతురును గురుకుల పాఠశాల లో చేర్పించారు. నందిని విద్య లో రానిస్తూనే క్రీడా రంగంపై ఆసక్తి పెంచుకున్నది. హెప్టాథ్లాన్‌లో రానిస్తూ నందిని వివిధ అంతర్జాతీయ వేదికల్లో నిరంతరం తన అత్యుత్తమ ప్రదర్శనను అందిస్తూ అభినందనలు అందుకుంటోంది.

నిఖత్ జరీన్ 12 ఏళ్ల వయసులో నిజామాబాద్‌లో జరిగిన అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొంది. వరుసగా రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. మహిళల బాక్సింగ్ సీనియర్ విభాగంలో దిగ్గజ మేరీ కోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా నిఖత్ జరీన్ ఘనత సాధించింది. నిజామాబాద్‌లో పుట్టిపెరిగిన నిఖత్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. నిఖత్ తండ్రి క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆ ఆసక్తే ఆయన నలుగురు కూతుళ్లలో ఇదర్ని క్రీడాకారిణులుగా తయారు చేసేలా చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 Asian Games
  • Agasara nandini
  • Boxer Nikhat Zareen
  • sports
  • telangana

Related News

T Congress

Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్‌లో జ‌రిగిన ఈ స‌మావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షీన‌ట‌రాజ‌న్‌, డిప్యూటీ సీఎం భ‌ట్టి, పీసీసీ చీఫ్ మ‌హేష్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశం సుమారు గంటన్నర పాటు కొనసాగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ బలోపే

  • Komatireddy

    Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Accident

    Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd