Namibia: 2026 టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన నమీబియా!
ఇటలీ జట్టు తొలిసారిగా టీ20 ప్రపంచ కప్‌లో ఆడనుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు జరగనుంది.
- By Gopichand Published Date - 07:01 PM, Thu - 2 October 25

Namibia: నమీబియా జట్టు (Namibia) 2026 టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. సుమారు నాలుగు నెలల తర్వాత భారత్, శ్రీలంకలలో ఈ ప్రపంచ కప్ జరగనుంది. ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన 16వ జట్టుగా నమీబియా నిలిచింది. ఆఫ్రికా రీజినల్ క్వాలిఫైయర్స్ సెమీఫైనల్‌లో నమీబియా టాంజానియాను 63 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచ కప్‌లో తమ స్థానాన్ని పదిలం చేసుకుంది.
మరో ఆఫ్రికా స్లాట్ కోసం పోటీ
టీ20 ప్రపంచ కప్‌లో ఆఫ్రికా ప్రాంతం నుంచి మరో ఒక్క స్థానం మాత్రమే మిగిలి ఉంది. ఈ స్థానం కోసం జింబాబ్వే- కెన్యా జట్లు పోటీపడుతున్నాయి. ఈ రెండు జట్లు రెండో సెమీఫైనల్‌లో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు 2026 టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తుంది. నమీబియా టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనడం ఇది నాల్గవసారి. అంతకుముందు ఆ జట్టు 2021, 2022, 2024 ప్రపంచ కప్‌లలో కూడా ఆడింది.
ఇప్పటికే అర్హత సాధించిన 16 జట్లు
నమీబియా కంటే ముందు 15 జట్లు టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి. టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ప్రపంచ కప్‌లో చివరి 3 స్థానాలను ఆసియా, ఈస్ట్ పసిఫిక్ క్వాలిఫైయర్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ క్వాలిఫైయర్ టోర్నమెంట్ అక్టోబర్ 8న ప్రారంభం కానుంది. ఇందులో జపాన్, కువైట్, మలేషియా, నేపాల్, ఒమన్, పపువా న్యూ గినియా, ఖతార్, సమోవా, యూఏఈ జట్లు అర్హత కోసం పోటీపడతాయి. ఇటలీ జట్టు తొలిసారిగా టీ20 ప్రపంచ కప్‌లో ఆడనుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు జరగనుంది.
Also Read: CM Chandrababu: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక సూచనలు!
ఇప్పటివరకు అర్హత సాధించిన జట్ల జాబితా
- భారత్ (Host)
- శ్రీలంక (Host)
- ఆఫ్ఘనిస్తాన్
- ఆస్ట్రేలియా
- బంగ్లాదేశ్
- దక్షిణాఫ్రికా
- ఇంగ్లాండ్
- వెస్టిండీస్
- యూఎస్‌ఏ
- పాకిస్తాన్
- న్యూజిలాండ్
- ఐర్లాండ్
- కెనడా
- నెదర్లాండ్స్
- ఇటలీ
- నమీబియా