HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Suryakumar Yadav Takes Charge As Mumbais New Captain

Suryakumar Yadav : ముంబై కొత్త సారథిగా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు!

  • Author : Vamsi Chowdary Korata Date : 21-11-2025 - 1:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Syed Mushtaq Ali Trophy
Syed Mushtaq Ali Trophy

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ 20 సిరీస్‌కు ముందు ముంబై తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఎంసీఏకు తెలియజేశాడట. టీ20 వరల్డ్ కప్ 2026 లక్ష్యంగా ఈ టోర్నీలో పూర్తిగా అందుబాటులో ఉంటానని ఎంసీఏకు హామీ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా వైట్ బాల్ ఫార్మాట్లకు సూర్యకుమార్ నేతృత్వం వహించనున్నాడు.

భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 2025 – 26 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సీనియర్ సెలెక్షన్ కమిటీ శుక్రవారం సమావేశమవ్వగా, సూర్యకుమార్ తన సేవలు అందుబాటులో ఉన్నట్లు స్పష్టంగా తెలియజేశారని సమాచారం. దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో భాగంగా జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌లకు ముందు, ముంబై తరఫున లీగ్ దశ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2026ను లక్ష్యంగా సయ్యద్ ముస్తాక్ అలీ మ్యాచ్‌లకు పూర్తిగా అందుబాటులో ఉంటానని సూర్యకుమార్ ఎంసీఏకు తెలిపారని సమాచారం. నవంబర్ 26 నుంచి లక్నోలో ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లలో ముంబై పాల్గొనగా, డిసెంబర్ 6, 8న జరిగే చివరి రెండు లీగ్ మ్యాచ్‌లలో సూర్య పాల్గొంటారా అన్న ఆసక్తి నెలకొంది. ఎందుకంటే డిసెంబర్ 9న భారత్ – దక్షిణాఫ్రికా తొలి టీ20 మ్యాచ్ కటక్‌లోని బారాబతి స్టేడియంలో ప్రారంభం కానుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రైల్వేస్, విదర్భ, ఆంధ్ర, అస్సాం, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా జట్లతో ముంబై పోటీపడనుంది.

ఈ సీజన్‌లో రంజీ ట్రోఫీకి శార్ధూల్ ఠాకూర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన ఎంసీఏ వైట్ బాల్ ఫార్మాట్లకు శ్రేయస్ అయ్యర్‌‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని భావించింది. అయితే అయ్యర్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో, అలాగే సూర్యకుమార్ లభ్యమవ్వడంతో ముంబై తమ టైటిల్ రక్షణ కోసం భారత టీ20 కెప్టెన్‌కే కమాండ్ అప్పగించనుంది.

పుదుచ్చేరిపై రంజీ మ్యాచ్‌ను ఆడటం కుదరని సూర్యకుమార్ ఎంసీఏకు ముందుగానే చెప్పేశాడు. ఇదే విధంగా దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కి సన్నద్ధం కావాలన్న కారణంతో శివమ్ దూబేకి కూడా రంజీ మ్యాచ్ నుంచి ఎంసీఏ సెలవు ఇచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్స్‌లో విదర్భపై ఆడిన తర్వాత సూర్య ముంబై తరఫున మళ్లీ ఆడలేదు. దేశీయ సీజన్ మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్ బిజీ షెడ్యూల్ కారణంగా స్కై ముంబై జట్టుకు దూరంగా ఉన్నాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket news
  • mumbai
  • Suryakumar Yadav
  • Syed Mushtaq Ali Trophy

Related News

T20 World Cup Tickets

T20 World Cup Tickets: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026.. టికెట్ల విక్రయం ప్రారంభం!

ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2026 కోసం మీ టికెట్లను డిసెంబర్ 11, 2025న భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 6:45 గంటలకు అమ్మకాలు ప్రారంభమైనప్పుడు కొనుగోలు చేయండి.

  • Hardik Pandya

    Hardik Pandya: పాండ్యాకు అరుదైన అవకాశం.. ప్రపంచ రికార్డుకు చేరువలో హార్దిక్‌!

  • Ashwin

    Ashwin: రవిచంద్రన్ అశ్విన్ పోస్ట్.. సన్నీ లియోన్ ఫోటోతో కన్‌ఫ్యూజ్ అయిన ఫ్యాన్స్!

  • Hardik Pandya

    Hardik Pandya: హార్దిక్ పాండ్యా లేకుండా టీమిండియా అసంపూర్ణం: సూర్యకుమార్ యాదవ్

  • IPL Mini Auction

    BCCI : పెద్ద పెద్ద స్టార్లకు బీసీసీఐ షాక్? వేలం నుంచి 1040 మంది ప్లేయర్లు ఔట్..!

Latest News

  • Virat Kohli- Rohit Sharma: కోహ్లీ-రోహిత్‌ల కాంట్రాక్ట్‌లో కోత? BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో మార్పులు!

  • SMS From 127000: మీ మొబైల్‌కు 127000 నంబర్ నుండి SMS వచ్చిందా? కారణం ఏంటంటే!

  • Healthy Drinks: ఒత్తిడిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన పానీయాలీవే!

  • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

  • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

Trending News

    • IPL Mini Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. అత్యధిక ధర పలికేది ఎవరికి?

    • Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయ‌స్ అయ్య‌ర్‌!

    • IPL 2026 Purse: ఐపీఎల్ 2026 వేలం.. ఏ జట్టు దగ్గర ఎంత డబ్బుంది?

    • UNESCO: దీపావళికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా!

    • Samantha: భ‌ర్త‌కు షాక్ ఇచ్చిన స‌మంత‌.. అస‌లు మేట‌ర్ ఏంటంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd