HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Suresh Raina Reveals Meeting Between Rishabh Pant And Ms Dhoni

Rishabh Pant: రిష‌బ్ పంత్ చేరే జ‌ట్టు ఇదేనా? మాజీ క్రికెటర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

రెండ్రోజుల క్రితం తాను ఢిల్లీలో ధోనిని కలవడానికి వెళ్లానని, రిషబ్ పంత్‌.. ధోనీతో ఉండటం చూశానని రైనా చెప్పాడు. అంతేకాకుండా పంత్ పసుపు జెర్సీలో కనిపిస్తాడ‌ని రైనా ప‌రోక్షంగా ఓ కామెంట్ చేశారు.

  • Author : Gopi Date : 01-11-2024 - 11:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Punjab Kings
Punjab Kings

Rishabh Pant: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) విడుదలయ్యాడు. దీంతో ఢిల్లీతో పంత్ తొమ్మిదేళ్ల అనుబంధానికి తెరపడింది. గాయం కారణంగా చాలా కాలం పాటు దూరంగా ఉన్న పంత్ గత సీజన్‌లో బలమైన పునరాగమనం చేశాడు. ఢిల్లీ నుంచి విడుద‌ల‌య్యాక ఇప్పుడు ఏ జట్టులోకి వస్తాడన్నదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా పంత్ గురించి కీలక వ్యాఖ్య‌లు చేశాడు. అతను ఇప్పుడు ఏ జట్టులో చేరవచ్చో సురేష్ రైనా జోస్యం చెప్పాడు.

తాజాగా జియోసినిమాలో మాట్లాడిన రైనా ఐపీఎల్ 2025 రిటైన్ష‌న్ గడువుకు కొన్ని రోజుల ముందు ఢిల్లీలో MS ధోని, పంత్‌లను కలిసి చూశానని వెల్లడించాడు. రైనా ఈ ప్రకటనతో పంత్ CSKలో చేరడంపై ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. రెండ్రోజుల క్రితం తాను ఢిల్లీలో ధోనిని కలవడానికి వెళ్లానని, రిషబ్ పంత్‌.. ధోనీతో ఉండటం చూశానని రైనా చెప్పాడు. అంతేకాకుండా పంత్ పసుపు జెర్సీలో కనిపిస్తాడ‌ని రైనా ప‌రోక్షంగా ఓ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌తో పంత్ చెన్నైలో చేరనున్న‌ట్లు వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఈసారి చెన్నై.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, మతిషా పతిరానా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీలను రిటైన్ చేసింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ వద్ద రూ. 55 కోట్ల విలువైన పర్స్, 1 RTM కార్డు మిగిలి ఉంది.

Also Read: Delhi Fire Dept: ఢిల్లీలో ఈసారి అత్యధిక ప్రమాదాలు.. 12 గంటల్లో 318 కాల్స్!

పంత్‌ను ఢిల్లీ ఎందుకు నిలబెట్టుకోలేదు?

పంత్‌కు భారీ డిమాండ్ ఉన్నందున అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ లిస్ట్ నుండి తప్పించారని మీడియా నివేదికలలో చెబుతున్నారు. పంత్ కెప్టెన్‌గా కొనసాగాలని కోరుకున్నాడు. కోచింగ్ సిబ్బంది నియామకంలో కూడా త‌న‌కు చెప్పాలని డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ యజమానులు పంత్‌ను జట్టులో ఉండాల‌ని కోరారు. కోచ్ పంత్‌ను కెప్టెన్‌గా కొనసాగించడానికి ఇష్టపడలేదు. దాని కారణంగా వివాదం పెరిగింది. ఈసారి ఢిల్లీ జట్టు అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పోరెల్‌లను రిటైన్ చేసుకుంది. అయితే త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే వేలంలో పంత్‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ ద‌క్కించుకోనుంద‌ని తెలుస్తోంది. పంత్‌తో పాటు కేఎల్ రాహుల్, శ్రేయ‌స్ అయ్య‌ర్ కూడా ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొన‌నున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CSK
  • delhi capitals
  • Indian Premeir League
  • IPL
  • IPL 2025
  • IPL 2025 Mega Auction
  • ms dhoni
  • Rishabh Pant
  • Suresh Raina

Related News

IPL 2026

RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

అహ్మదాబాద్ న‌రేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 156 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ నిరాశపరచగా, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు క

  • Ipl 2026

    IPL 2026 : సూర్యవంశీ విధ్వంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd