World CUP 2023: డైమండ్ బ్యాట్ తో బరిలోకి కోహ్లీ
ప్రపంచ క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సరిగ్గా పదిహేనేళ్ల కృతంగా టీమిండియాలో అడుగుపెట్టిన విరాట్ మొదట శ్రీలంకపై ఆడాడు.
- By Praveen Aluthuru Published Date - 06:00 PM, Sat - 19 August 23

World CUP 2023: ప్రపంచ క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం టీమిండియాలో అడుగుపెట్టిన విరాట్ మొదట శ్రీలంకపై ఆడాడు. ఆ రోజు మొదలైన కోహ్లీ దండయాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఆటగాడిగా, కెప్టెన్ గా జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. కోహ్లీ ప్రస్తుతం 2023 ప్రపంచ కప్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. అంతకుముందు ఆసియా కప్ లో కోహ్లీ ఆడనున్నాడు. ఇదిలా ఉంటే కోహ్లీ డైమండ్ బ్యాట్ తో ప్రపంచ కప్ బరిలోకి దిగబోతున్నాడు.
సూరత్‌కు చెందిన బిజినెస్ మెన్ ఉత్పల్ మిస్త్రీ కోహ్లీకి డైమండ్ బ్యాట్ గిఫ్టుగా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు. 1.04 క్యారెట్ల వజ్రాలు పొదిగిన బ్యాట్‌ను తయారు చేసి కోహ్లీకి ఇస్తాడట.ఈ బ్యాట్ ధర అక్షరాల పది లక్షలు. బ్యాట్ ని తయారు చేయడానికి కనీసం నెల సమయం పడుతుంది. సో ఈ నెల అంతా తాను కోహ్లీ బ్యాట్ కోసమే సమయం వెచ్చించనున్నాడు. వరల్డ్ కప్ లోపు కోహ్లీని కలిసి డైమండ్ బ్యాట్ ను ఇవ్వాలి అనుకుంటున్నట్టు ఉత్పల్ మిస్త్రీ చెప్తున్నాడు.
Also Read: Anasuya Video: బోరున ఏడ్చేసిన అనసూయ, షాకైన నెటిజన్స్!