Ishan Kishan: హైదరాబాద్‌లో ఇషాన్ కిషన్ ఊచకోత.. ఐపీఎల్ 2025లో తొలి సెంచరీ!
దీంతో ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోర్‌ను కూడా హైదరాబాద్ జట్టే నమోదు చేయడం విశేషం. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 287 పరుగులు అత్యధికం.
- By Gopichand Published Date - 05:41 PM, Sun - 23 March 25

Ishan Kishan: ఐపీఎల్ 2025లో రెండో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఈ సమయంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (Ishan Kishan) 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇది అతని ఐపిఎల్ కెరీర్‌లో మొదటి సెంచరీ కూడా. 47 బంతులు ఆడిన ఇషాన్ కిషన్ అజేయంగా 106 పరుగులు చేశాడు. అందులో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. ఇషాన్‌తో పాటు మిగిలిన హైదరాబాద్ ఆటగాళ్లు కూడా రాణించటంతో సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.
Also Read: MS Dhoni: సీఎస్‌కే నా ఫ్రాంచైజీ.. రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన ఎంఎస్ ధోనీ!
దీంతో ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోర్‌ను కూడా హైదరాబాద్ జట్టే నమోదు చేయడం విశేషం. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 287 పరుగులు అత్యధికం. ఈ స్కోర్ కూడా ఆర్సీబీపై సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించింది. గతేడాది ఏప్రిల్ 15న జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఈ ఘనతను సాధించింది.
20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. దీంతో ఎస్ఆర్‌హెచ్ 6 ఓవర్లు ముగిసేసరికి 286 పరుగులు చేసింది. హైదరాబాద్ తరుపున ఇషాన్ కిషన్ అద్భుత సెంచరీ చేశాడు. 47 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో11 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. కిషన్‌తో పాటు ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 67 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 287 పరుగులు చేయాలి. రాజస్థాన్ రాయల్స్ తరఫున తుషార్ దేశ్‌పాండే 3 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు.
𝙏𝙝𝙖𝙩 𝙢𝙖𝙞𝙙𝙚𝙣 #TATAIPL 𝙘𝙚𝙣𝙩𝙪𝙧𝙮 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜 🧡
A special first for Ishan Kishan as he brought up his 💯 off just 45 balls 🔥
Updates ▶️ https://t.co/ltVZAvInEG#SRHvRR | @SunRisers | @ishankishan51 pic.twitter.com/8n92H58XbK
— IndianPremierLeague (@IPL) March 23, 2025
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కమాండ్ రాగ్ చేతిలో ఉండగా, హైదరాబాద్ తరఫున ప్యాట్ కమిన్స్ ఈ పాత్రను పోషించనున్నాడు. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 20 మ్యాచ్‌లు జరగ్గా, అందులో హైదరాబాద్ 11 మ్యాచ్‌లు గెలవగా, రాజస్థాన్ 9 గెలిచింది.