MS Dhoni: సీఎస్‌కే నా ఫ్రాంచైజీ.. రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన ఎంఎస్ ధోనీ!
ఐపీఎల్ 2025లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్‌లో రాత్రి 7:30 గంటలకు జరగనుంది.
- By Gopichand Published Date - 05:23 PM, Sun - 23 March 25

MS Dhoni: ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni ) IPL నుండి రిటైర్మెంట్ వార్తలు వార్తల్లో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ధోని టీ షర్ట్. ఇందులో ఇదే చివరిసారి అని వ్రాయబడింది. ఈ టీ షర్ట్ వేసుకుని చెన్నై చేరుకున్నాడు. దీంతో ధోనీ ఈ ఏడాది ఐపీఎల్ ఆడిన తర్వాత ఈ లీగ్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి.
ఐపీఎల్ 2025లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్‌లో రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఈ సీజన్‌కు ముందు CSK మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీజన్ 18 ధోనీకి చివరి IPL సీజన్ అవుతుందా? ఐపీఎల్ నుంచి కూడా ధోనీ రిటైర్ అవుతాడా? అని ప్రశ్నలు మొదలయ్యాయి. ఇప్పుడు వాటన్నింటికి ఎంఎస్ ధోనీ కూడా సమాధానం ఇచ్చాడు.
Also Read: KTRs Convoy : కేటీఆర్ కాన్వాయ్‌లో అపశృతి.. ఏమైందంటే..
CSK తరపున ఆడటంపై ధోనీ ఏమన్నాడు?
ఈసారి ఐపీఎల్ 2025లో ధోనీ అత్యంత పెద్ద వయస్కుడు. అతడి వయసు 43 ఏళ్లు కాగా, మరో ఐపీఎల్ సీజన్ ఆడేందుకు ధోనీ సిద్ధమయ్యాడు. ఇప్పుడు CSK vs ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు ముందు ధోని Jio Hotstarలో “నేను కోరుకున్నంత కాలం CSK కోసం ఆడగలను” అని చెప్పాడు. ఇది నా ఫ్రాంచైజీ. వీల్ చైర్ లో ఉన్నా నన్ను ఈడ్చుకెళ్తారని ధోనీ చెప్పాడు. అంటే ధోనీ వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడనున్నట్లు ఇప్పుడే హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ధోని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడనున్నాడు
ఎంఎస్ ధోని తొలిసారిగా ఐపీఎల్‌లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా కనిపించనున్నాడు. ధోని 2019 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అయితే అప్పటి నుండి ధోనీ ఐపీఎల్ ఆడుతున్నాడు. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్‌పై ధోనీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని పై కామెంట్స్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది.