Sourav Ganguly: సెహ్వాగ్, ధోనీ కోసం గంగూలీ త్యాగం
వీరేంద్ర సెహ్వాగ్ మరియు ఎంఎస్ ధోనీలను స్టార్‌లుగా మార్చడంలో సౌరవ్ గంగూలీ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌరభ్ గంగూలీ తన మరియు ధోనీ కోసం తన స్థానాన్ని విడిచిపెట్టాడని గుర్తు చేసుకున్నాడు
- By Praveen Aluthuru Published Date - 02:56 PM, Wed - 10 July 24

Sourav Ganguly: అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో గంగూలీ ఒకరు కావడం గమనార్హం. అతని కెప్టెన్సీలో టీం ఇండియా ఎన్నో చిరస్మరణీయమైన మరియు చారిత్రాత్మక మ్యాచ్‌లను గెలుచుకుంది. దాదా కెప్టెన్సీలో చాలా మంది యువ ఆటగాళ్లు తమ కెరీర్‌ను ప్రారంభించి స్టార్‌లుగా ఎదిగారు. వీరేంద్ర సెహ్వాగ్ మరియు ఎంఎస్ ధోనీలను స్టార్‌లుగా మార్చడంలో సౌరవ్ గంగూలీ కీలక పాత్ర పోషించాడు.
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌరభ్ గంగూలీ తన మరియు ధోనీ కోసం తన స్థానాన్ని విడిచిపెట్టాడని గుర్తు చేసుకున్నాడు. దాదా మొదట నా కోసం ఓపెనింగ్ స్థానాన్ని వదులుకున్నాడని. ఆపై ఎంఎస్ ధోనీకి 3వ స్థానాన్ని వదిలిపెట్టాడని వీరూ చెప్పాడు. ధోనీ 3వ నంబర్‌లో కాకుండా 6వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే ధోనీ ఇప్పుడు అంత గొప్ప ఆటగాడిగా పేరొందె వాడు కాదేమోనని ఆభిప్రాయప్పడ్డాడు. గంగూలీ కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
సౌరవ్ గంగూలీ టీమిండియా తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 42.2 సగటుతో బ్యాటింగ్ చేస్తూ 7212 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 16 సెంచరీలు మరియు 35 అర్ధ సెంచరీలు చేశాడు. 311 వన్డే మ్యాచ్‌ల్లో గంగూలీ 41 సగటుతో 11363 పరుగులు చేశాడు. గంగూలీ వన్డేల్లో 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇది కాకుండా గంగూలీ కొన్నేళ్లు ఐపీఎల్ కూడా ఆడాడు. ఐపీఎల్‌లో 59 మ్యాచ్‌లు ఆడి 1349 పరుగులు చేశాడు. ఇందులో 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి.ఇక తన క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాతా దాదా బీసీసీఐ చీఫ్ గా కూడా సేవాళ్ళందించాడు.
Also Read: Nara Lokesh : నారా లోకేష్ “ప్రజాదర్బార్”కు విన్నపాల వెల్లువ