Nara Lokesh : నారా లోకేష్ “ప్రజాదర్బార్”కు విన్నపాల వెల్లువ
ఏపీ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్ కు” విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.
- By Pasha Published Date - 02:30 PM, Wed - 10 July 24

Nara Lokesh : ఏపీ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్ కు” విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో 15వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో తొలగించిన పెన్షన్లు, రేషన్ కార్డులను పునరుద్ధరించాలని ప్రజలు లోకేష్‌ను కోరారు. ప్రతి ఒక్కరి నుంచి విన్నపాలు స్వీకరించిన మంత్రి లోకేష్(Nara Lokesh).. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join
గడ్డం గ్యాంగ్‌పై చర్యలు తీసుకోండి
కృష్ణా జిల్లా గుడివాడలో గడ్డం గ్యాంగ్ ఆగడాలకు తీవ్రంగా నష్టపోయానని, సదరు గ్యాంగ్ పై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మంత్రి లోకేష్‌ను కలిసి ముసునూరి హరికృష్ణ ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అప్పటి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అండతో గడ్డం గ్యాంగ్ రంగంలోకి దిగి ఫైబర్ నెట్ సిగ్నల్ వ్యవస్థకు విద్యుత్ ప్రసారం కాకుండా అడ్డుకుందని తెలిపారు. గడ్డం గ్యాంగ్ నుంచి రక్షణ కల్పించాలని హరికృష్ణ కోరారు.
Also Read :KTR : ప్రభుత్వ భూములను ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెడతారా ? : కేటీఆర్
క్యాన్సర్‌తో బాధపడుతున్న తనకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించాలని లోకేష్‌ను కలిసి మంగళగిరి మండలం నవులూరుకు చెందిన పుల్లకూర అరుణ విజ్ఞప్తి చేశారు.గత ప్రభుత్వం తొలగించిన వృద్ధాప్య పెన్షన్ పునరుద్ధరించాలని ఉండవల్లికి చెందిన బత్తుల కృష్ణ విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుడైన తన కుమారుడికి పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన బి.రంగారావు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె మంచానికి పరిమితమైందని, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన తోకల బాలాజి విజ్ఞప్తి చేశారు.ఎలాంటి ఆధారం లేని తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన సీహెచ్.పల్లవి కోరారు. ప్రజల విన్నపాలను(Prajadarbar) నారా లోకేష్ ఓపికగా విన్నారు. వాటికి తగిన పరిష్కారం దొరికేలా చూస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని లోకేష్ భరోసా ఇచ్చారు.