IND vs SL 2nd ODI: చితక్కొడుతున్న హిట్ మ్యాన్, ఫిఫ్టీ కంప్లీట్
తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన హిట్ మ్యాన్ రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగించాడు. రోహిత్ 44 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ లో అతను 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు
- By Praveen Aluthuru Published Date - 07:47 PM, Sun - 4 August 24

IND vs SL 2nd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత క్రికెట్ జట్టు, శ్రీలంక క్రికెట్ జట్టు మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది.
241 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టును రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన హిట్ మ్యాన్ రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగించాడు. రోహిత్ 44 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ లో అతను 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అటు గిల్ కూడా జోరు కొనసాగిస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్ 2 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. తద్వారా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన నాల్గవ భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
రోహిత్ శర్మ ఈరోజు తన కెరీర్‌లో 264వ వన్డే మ్యాచ్‌ని ఆడుతున్నాడు. 256 ఇన్నింగ్స్‌లలో అతను 50 సగటుతో మరియు 92 స్ట్రైక్ రేట్‌తో 10769 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్‌ను అధిగమించాడు.ద్రవిడ్ తన కెరీర్‌లో 340 వన్డేలు ఆడాడు. 314 ఇన్నింగ్స్‌లలో 39.15 సగటుతో మరియు 71.18 స్ట్రైక్ రేట్‌తో 10768 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు సచిన్ టెండూల్కర్. సచిన్ వన్డేలో 18426 పరుగులు, విరాట్ కోహ్లీ 13872 పరుగులు, సౌరవ్ గంగూలీ: 11221 పరుగులు చేశారు.
Also Read: Waqf Board Bill: వక్ఫ్ బోర్డు బిల్లు మత స్వేచ్ఛకు విరుద్ధం: ఒవైసీ