Waqf Board Bill: వక్ఫ్ బోర్డు బిల్లు మత స్వేచ్ఛకు విరుద్ధం: ఒవైసీ
వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేసేందుకు వక్ఫ్ చట్టాన్ని సవరించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొనే బోర్డు అధికారాన్ని అరికట్టడం ఈ సవరణల లక్ష్యం. అయితే ఇది మత స్వేచ్ఛకు విరుద్ధమని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
- By Praveen Aluthuru Published Date - 07:35 PM, Sun - 4 August 24

Waqf Board Bill: వక్ఫ్ బోర్డు ఆస్తులపై హక్కులను తగ్గించే బిల్లును తీసుకురావాలనే కేంద్రం యోచన మత స్వేచ్ఛకు విరుద్ధమని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. పార్లమెంటరీ ఆధిపత్యానికి, అధికారాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఒవైసీ అన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ బిల్లు గురించి పార్లమెంటుకు తెలియజేయకుండా మీడియాకు తెలియజేస్తున్నారని మండిపడ్డారు.
వక్ఫ్ బోర్డు ఆస్తులపై హక్కులను తగ్గించే బిల్లు మత స్వేచ్ఛకు విరుద్ధమని ఆయన అన్నారు. బిజెపి మొదటి నుండి వక్ఫ్ ఆస్తులకు వ్యతిరేకంగానే ఉందని ఆయన చెప్పారు. బీజేపీ మరోసారి హిందూత్వ ఎజెండా ప్రదర్శించిందని ఒవైసి చెప్పారు. వక్ఫ్ బోర్డు స్థాపన మరియు నిర్మాణాన్ని సవరిస్తే పరిపాలనా విభాగంలో గందరగోళం ఏర్పడుతుందని చెప్పిన ఆయన, వక్ఫ్ బోర్డు స్వయంప్రతిపత్తి పోతుందని అభిప్రాయపడ్డారు. అలాగే వక్ఫ్ బోర్డుపై ప్రభుత్వ నియంత్రణ పెరిగితే వక్ఫ్ స్వాతంత్ర్యం దెబ్బతింటుందని చెప్పారు.
వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేసేందుకు వక్ఫ్ చట్టాన్ని సవరించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొనే బోర్డు అధికారాన్ని అరికట్టడం ఈ సవరణల లక్ష్యం.
Also Read: Mooments of G2 : గూఢచారి 2 మూమెంట్స్ అదిరిపోయాయ్..!