India vs Afghanistan : చెలరేగిన శివమ్ దూబే, జైస్వాల్.. ఆఫ్గనిస్తాన్‌పై భారత్ సిరీస్ కైవసం
India vs Afghanistan : సొంత గడ్డపై కొత్త ఏడాదిలో టీమిండియా జోరు కొనసాగుతోంది.
- By Pasha Published Date - 11:24 AM, Mon - 15 January 24

India vs Afghanistan : సొంత గడ్డపై కొత్త ఏడాదిలో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకొని సిరీస్ కైవసం చేసుకుంది. అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి మ్యాచ్ లో దుమ్మురేపిన శివమ్ దూబే మరోసారి రెచ్చిపోగా.. యశస్వి జైస్వాల్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు.ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది .ఇబ్రహీమ్ జడ్రాన్ హాఫ్ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లతో అఫ్గానిస్థాన్ పతనాన్ని శాసించారు. శివమ్ దూబేకు ఓ వికెట్(India vs Afghanistan) దక్కింది.
We’re now on WhatsApp. Click to Join.
టీమిండియాకు తొలి ఓవర్‌లోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదడంతో టీమిండియా ఐదు ఓవర్లలోనే 60 పరుగులు చేసింది. కోహ్లీ ఔట్ అయ్యాక దూబే, జైస్వాల్ ఆఫ్గన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. పోటా పోటీగా సిక్సర్ల మోత మోగించారు. జైస్వాల్ కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు నబీ ఓవర్‌లో శివమ్ దూబే హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. దూబే 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 92 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పారు. జితేశ్ శర్మ డకౌటైనా రింకూ సింగ్ సాయంతో శివమ్ దూబే భారత విజయాన్ని పూర్తి చేశాడు.శివమ్ దూబే 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63, యశస్వి జైస్వాల్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 68 పరుగులు చేశారు.