Shardul Thakur: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై శార్ధుల్ ఠాకూర్ ప్లాన్ ఇదే..!
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి, లక్నో సూపర్ జెయింట్స్ IPL 2025 (సీజన్-18)లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.
- By Gopichand Published Date - 09:09 AM, Fri - 28 March 25

Shardul Thakur: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి, లక్నో సూపర్ జెయింట్స్ IPL 2025 (సీజన్-18)లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో లక్నో తరపున శార్దుల్ ఠాకూర్ (Shardul Thakur) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం శార్దుల్, సన్‌రైజర్స్‌పై తన వ్యూహం ఏమిటో వెల్లడించాడు.
శార్దుల్ ఠాకూర్ ప్లాన్ ఏమిటి?
మ్యాచ్ తర్వాత శార్దుల్ ఠాకూర్ ఇలా అన్నాడు. హెడ్, అభిషేక్ తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి, నేనూ నా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావించాను. కొత్త బంతితో స్వింగ్ ఉంటే వికెట్లు తీసే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేశాను. ఇలాంటి మ్యాచ్‌లలో బౌలర్లకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పుకొచ్చాడు.
Also Read: UAE President Mohamed: 500 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసేందుకు UAE ప్రధాని ఆదేశం
గత మ్యాచ్‌లో కూడా నేను చెప్పాను. పిచ్‌లను ఆట సమతూకంలో ఉండేలా తయారు చేయాలి. ఇంపాక్ట్ సబ్ నియమం అమలులోకి వచ్చిన తర్వాత, ఒక జట్టు 240-250 పరుగులు చేస్తే, అది బౌలర్లకు సరిపోదని శార్దుల్ చెప్పాడు.
Shardul Thakur said, "the batters are coming hard at the bowlers, why don't the bowlers go hard at the batter? That was our plan Vs SRH". pic.twitter.com/mzQG44ETdh
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 27, 2025
శార్దుల్ అత్యధిక వికెట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై శార్దుల్ ఠాకూర్ అద్వితీయ బౌలింగ్ ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్, మహ్మద్ షమీలను ఔట్ చేశాడు.
పర్పల్ క్యాప్ హోల్డర్‌గా శార్దుల్
శార్దుల్ ఠాకూర్ తొలి మ్యాచ్ నుంచే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన అతను, హైదరాబాద్‌పై 4 వికెట్లు సాధించాడు. దీంతో 2 మ్యాచ్‌లలో అతని వికెట్ల సంఖ్య 6కి చేరింది. ప్రస్తుతం 6 వికెట్లతో పర్పల్ క్యాప్ శార్దుల్ ఠాకూర్ సొంతం చేసుకున్నాడు.
SHARDUL THAKUR – PURPLE CAP HOLDER AFTER BEING UNSOLD. 🥶 pic.twitter.com/CubMyG2WSK
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 27, 2025
Also Read: Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకం.. త్వరలోనే అమలు!