Rohit- Virat- Shubman: ఈరోజు మ్యాచ్ లో టీమిండియాకు ఈ ముగ్గురే మెయిన్..!
ర్మశాలలో భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. 2023 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లూ మంచి ప్రదర్శన కనబరిచాయి. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ లో రోహిత్, విరాట్, గిల్ (Rohit- Virat- Shubman) ఎవరూ రాణిస్తారో చూడాల్సి ఉంది.
- By Gopichand Published Date - 11:43 AM, Sun - 22 October 23

Rohit- Virat- Shubman: ధర్మశాలలో భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. 2023 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లూ మంచి ప్రదర్శన కనబరిచాయి. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా, పోటీగా ఉంటుంది. ధర్మశాలలో విరాట్ కోహ్లి రికార్డు బాగానే ఉంది. కాగా.. న్యూజిలాండ్‌పై శుభ్‌మన్ గిల్ ఇటీవల మంచి ప్రదర్శన చేశాడు. వీరితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మపై కూడా అభిమానులకు అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ లో రోహిత్, విరాట్, గిల్ (Rohit- Virat- Shubman) ఎవరూ రాణిస్తారో చూడాల్సి ఉంది.
న్యూజిలాండ్‌పై కోహ్లీకి మంచి రికార్డు
2023 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అద్భుత ప్రదర్శన చేశాడు. ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు చేశాడు. బంగ్లాదేశ్‌పై కోహ్లి అజేయంగా 103 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై అజేయంగా 55 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై 85 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్‌గా న్యూజిలాండ్‌పై కోహ్లి ఆటతీరును పరిశీలిస్తే అద్భుతంగా ఉంది. కోహ్లి 29 మ్యాచ్‌ల్లో 1433 పరుగులు చేశాడు. ఈ సమయంలో కోహ్లీ 5 సెంచరీలు, 8 అర్ధ సెంచరీలు సాధించాడు.
న్యూజిలాండ్‌పై శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ
ఇటీవల పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు. గిల్ 53 పరుగులు చేశాడు. గిల్ ఇప్పటివరకు న్యూజిలాండ్‌తో 8 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో 484 పరుగులు చేశాడు. ఈ జట్టుపై శుభ్‌మన్ 2 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్‌పై శుభ్‌మన్ డబుల్ సెంచరీ కూడా చేశాడు. జనవరి 2023లో హైదరాబాద్ వన్డేలో 208 పరుగులు చేశాడు.
We’re now on WhatsApp. Click to Join.
న్యూజిలాండ్‌పై రోహిత్ రెండు సెంచరీలు
భారత కెప్టెన్ రోహిత్ కూడా ఫామ్‌లో ఉన్నాడు. ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌పై సెంచరీ సాధించాడు. దీని తర్వాత అతను పాకిస్థాన్‌పై 86 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్‌పై 48 పరుగులు చేశాడు. ఇప్పుడు న్యూజిలాండ్‌తో మైదానంలోకి దిగనున్నాడు. ఓపెనర్‌గా రోహిత్ భారత్‌కు శుభారంభం అందించగలడు. న్యూజిలాండ్‌తో రోహిత్ 27 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో 889 పరుగులు చేశారు. రోహిత్ 2 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు సాధించాడు.