Rohit Sharma 100: రోహిత్ శర్మ సెంచరీ.. ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సెంచరీ చేశాడు. కెరీర్‌లో అతడికి 9వ శతకం. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టుల్లో రోహిత్ సెంచరీ కొట్టడం విశేషం.
- By Gopichand Published Date - 01:24 PM, Fri - 10 February 23

నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సెంచరీ చేశాడు. కెరీర్‌లో అతడికి 9వ శతకం. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టుల్లో రోహిత్ సెంచరీ కొట్టడం విశేషం. ప్రస్తుతం 69 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 192/5. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 15 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్ (105*)తో పాటు జడేజా (13*) ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 171 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ 100 పరుగుల మార్క్‌ని అందుకున్నాడు. సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో రోహిత్ శర్మకి ఇది 9వ సెంచరీ. గురువారం 177 పరుగులకి ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆలౌటైన విషయం తెలిసిందే.
Also Read: Womens T20 World Cup 2023: నేటి నుండి మహిళల టీ20 వరల్డ్ కప్
నాగ్‌పూర్ టెస్టులో లంచ్ తర్వాత భారత్ తడబడుతోంది. స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై ఆసీస్ స్పిన్నర్లు రెచ్చిపోతున్నారు. లంచ్ తర్వాత తొలి బంతికే విరాట్ కోహ్లీ (12)ని మర్ఫీ పెవిలియన్ చేర్చాడు. కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ (8) కూడా ఆకట్టుకోలేదు. నాథన్ లియాన్ బౌలింగ్ లో అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆసీస్ కొత్త స్పిన్నర్ మర్ఫీనే 4 వికెట్లు తీశాడు.