HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rohit Sharma Got Trolled For Yet Another Failure With The Bat

Rohit Sharma: మ‌రోసారి నిరాశ‌ప‌రిచిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌.. 14 ప‌రుగుల‌కే ఔట్‌

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. విశాఖపట్నం టెస్టులో ఇంగ్లండ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులకే ఔటయ్యాడు.

  • Author : Gopi Date : 02-02-2024 - 11:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rohit Sharma
Safeimagekit Resized Img 11zon (1)

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. విశాఖపట్నం టెస్టులో ఇంగ్లండ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులకే ఔటయ్యాడు. భారత్‌కు రోహిత్ వికెట్ చాలా కీలకం. కానీ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. ఇంగ్లండ్ యువ బౌలర్ షోయబ్ బషీర్ చేతిలో అతడు పెవిలియ‌న్ చేరుకున్నాడు. బషీర్ తన అరంగేట్రం టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. అతని వయస్సు కేవలం 20 సంవత్సరాలు.

శుక్రవారం నుంచి విశాఖపట్నంలో ప్రారంభమైన టెస్టు మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సమయంలో రోహిత్ శర్మ- యశస్వి జైస్వాల్ భారత్‌కు ఓపెనింగ్ చేయడానికి వచ్చారు. 41 బంతుల్లో 14 పరుగులు చేసి రోహిత్ ఔటయ్యాడు. ఇంగ్లండ్ బౌలింగ్‌లో 18వ ఓవర్ బషీర్ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ మూడో బంతికి రోహిత్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అతని క్యాచ్‌ను ఒలీ పోప్ పట్టుకున్నాడు. ఇది చాలా కష్టమైన క్యాచ్. కానీ పోప్ ఎలాంటి తప్పు చేయలేదు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌రోసారి త‌క్కువ ప‌రుగుల‌కే ఔట్ కావ‌డంతో సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read: IND vs ENG: టాస్ గెలిచిన టీమిండియా.. భార‌త్ జ‌ట్టు ఇదే..!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేయడం గమనార్హం. 51 పరుగులు చేసిన తర్వాత యశస్వి భారత్ తరఫున నిల‌క‌డ‌గా ఆడుతున్నాడు. మరో ఎండ్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ ఉన్నాడు. రోహిత్ తర్వాత శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. 46 బంతులు ఎదుర్కొని 34 పరుగులు చేశాడు. శుభ్‌మన్‌ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు ఉన్నాయి.

We’re now on WhatsApp : Click to Join

రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుంటే.. గత కొన్ని టెస్ట్ ఇన్నింగ్స్‌లలో నిల‌క‌డ‌లేని ఫామ్‌తో ఇబ్బంది ప‌డుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న హైదరాబాద్ టెస్టులో రోహిత్ 24, 39 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందు కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక ఇన్నింగ్స్‌లో అతను 39 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన 55 టెస్టు మ్యాచ్‌ల్లో రోహిత్ 3800 పరుగులు మాత్ర‌మే చేశాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IND vs ENG
  • India vs England
  • rohit sharma
  • team india
  • vishakapatnam

Related News

Vaibhav Suryavanshi to make his debut in the second T20 between India and England today!

vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

ఇంగ్లండ్‌తో ఇవాళ జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కొత్త అధ్యాయం’ అనే క్యాప్షన్‌తో అతను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో వర్షం కారణంగా రద్దయిన తొలి టీ20లోనూ వైభవ్ బెంచ్‌కే పరి

  • India vs. Sri Lanka Test series schedule...

    IND vs SL: ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd