Rohit Sharma: రేపటి నుండి భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు.. ప్లేయింగ్ ఎలెవన్‌పై స్పందించిన రోహిత్ శర్మ
రెండో మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పందించాడు. అలాగే టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు.
- Author : Gopichand
Date : 19-07-2023 - 12:48 IST
Published By : Hashtagu Telugu Desk
Rohit Sharma: భారత్-వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి ట్రినిడాడ్‌లో రెండో మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పందించాడు. అలాగే టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. పిచ్, కండిషన్ చూసి ప్లేయింగ్ ఎలెవన్‌ను నిర్ణయిస్తామని రోహిత్ చెప్పాడు.
ప్లేయింగ్ ఎలెవన్‌లో బహుశా ఎలాంటి మార్పు ఉండదని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నుండి వచ్చిన ఒక వార్త ప్రకారం.. రోహిత్ మాట్లాడుతూ “డొమినికాలోని పిచ్, పరిస్థితి గురించి మాకు బాగా తెలుసు. ఇక్కడ వర్షం విషయంలో క్లారిటీ లేదు. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో పెద్దగా మార్పు ఉంటుందని నేను అనుకోవటంలేదు. అయితే ఇక్కడి పరిస్థితి, పిచ్‌ను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం” అని చెప్పుకొచ్చాడు.
Also Read: Brian Lara: బ్రయాన్ లారా ఔట్.. కొత్త కోచ్ వేటలో సన్ రైజర్స్..!
భారత జట్టు ఆటగాళ్లపై రోహిత్ కూడా ప్రశంసలు కురిపించాడు. మన ఆటగాళ్లు బాగా రాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆటగాళ్ల పాత్ర కీలకం. అందుకే టీమ్‌లో ఎవరి పాత్ర ఏమిటనే దానిపై కూడా క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత ఎలా ప్రిపేర్ అవుతారో, ఎలా పని చేస్తారో వారి ఇష్టం అన్నాడు. తొలి టెస్టులో భారత్ 421 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టీమిండియా తరఫున యశస్వి జైస్వాల్ 171 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 387 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. కాగా రోహిత్ శర్మ 103 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 76 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే ఆలౌటైంది. దింతో భారత్ భారీ విజయాన్ని నమోదు చేసి 1-0 ఆధిక్యంలో ఉంది.