Rohit Sharma: భార్యని వదల్లేక రోహిత్.. బుంగమూతి పెట్టిన భార్య
రోహిత్ శర్మను ఫ్యాన్స్ హిట్ మ్యాన్ గా పిలుచుకుంటారు. ఎందుకంటే మనోడి హిట్టింగ్ అట్లుంటది మరి. బరిలోకి దిగాడా అంతే ఎడాపెడా బాదడమే పనిగా పెట్టుకుంటాడు.
- Author : Praveen Aluthuru
Date : 27-09-2023 - 5:42 IST
Published By : Hashtagu Telugu Desk
Rohit Sharma: రోహిత్ శర్మను ఫ్యాన్స్ హిట్ మ్యాన్ గా పిలుచుకుంటారు. ఎందుకంటే మనోడి హిట్టింగ్ అట్లుంటది మరి. బరిలోకి దిగాడా అంతే ఎడాపెడా బాదడమే పనిగా పెట్టుకుంటాడు. 2 ఓవర్లు నిలకడగా ఆడితే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. ఫోర్లు సిక్సర్లను సునాయాసంగా బాదేస్తాడు. టెస్టు మ్యాచ్ లో 300 పరుగులు సాధించిందంటే రోహిత్ విధ్వంసం ఎట్లుంటదో ఊహించవచ్చు. కానీ రోహిత్ విధ్వంసం అంతా మైదానంలోనే. బయట రోహిత్ భాయ్ పక్కా ఫామిలీ మ్యాన్. ఖాళీ సమయంలో భార్యాపిల్లలకు సాధ్యమైనంత సమయం కేటాయిస్తాడు.
ఈ ఏడాది రోహిత్ శర్మ సారధ్యంలో టీమిండియా వరల్డ్ కప్ ఆడనుంది.. దానికి ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. మొదటి రెండు వన్డేలకు దూరంగా ఉన్న రోహిత్ రాజ్ కోట్ లో జరగనున్న మూడో వన్డేలో జాయిన్ అయ్యాడు . ఈ క్రమంలో ముంబై నుంచి రాజ్‌కోట్ వెళ్లేందుకు రోహిత్ ను కారులో దిగబెట్టేందుకు అతని భార్య రితిక సజ్దే ఎయిర్ పోర్టుకుకు వచ్చింది. కారు దిగి భార్యను వదిలి వెళ్లే సమయంలో కారులోకి వంగి మరీ ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత అతన్ని వదిలి ఉండటం ఇష్టం లేనట్లు రితిక మొఖం పెట్టింది. అది చూసిన రోహిత్.. నవ్వుతూ చెయ్యి ఊపి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ రోహిత్ బయ్యా హిట్ మ్యాన్ కాదు రొమాంటిక్ మ్యాన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Rohit Sharma on the way to Rajkot for the 3rd ODI. [Viral Bhayani]
– Cutest video of the day.pic.twitter.com/ysOSoKjEkS
— Johns. (@CricCrazyJohns) September 26, 2023
Also Read: BRS NRIs: ఎమ్మెల్సీ కవిత తో బీఆరెస్ ఎన్నారైల బృందం భేటీ