Rohit Sharma Visit Tirupathi: తిరుపతిలో సందడి చేసిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్..!
ఆసియాకప్‌కు ముందు తిరుమల శ్రీవారిని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma Visit Tirupathi) దర్శించుకున్నాడు.
- Author : Gopichand
Date : 13-08-2023 - 2:19 IST
Published By : Hashtagu Telugu Desk
Rohit Sharma Visit Tirupathi: ఆసియాకప్‌కు ముందు తిరుమల శ్రీవారిని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma Visit Tirupathi) దర్శించుకున్నాడు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో రోహిత్ పాల్గొన్నాడు. రోహిత్ శర్మకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం ఆనంతరం రోహిత్ దంపతులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు రోహిత్ ను సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Rohit Sharma & his family visited Tirupathi Balaji Temple.
The man, The Myth, The Legend.pic.twitter.com/hLiUiXgmUj
— R A T N I S H (@LoyalSachinFan) August 13, 2023
Also Read: Rule In Cricket: క్రికెట్ లో ఈ రూల్ గురించి తెలుసా..? బ్యాట్స్‌మెన్ ఇలా చేస్తే ఔట్..?!
ఆసియా కప్ 2023 ఆగస్ట్ 30 నుండి ప్రారంభం కానుంది. టోర్నీలో భారత జట్టు సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు పలువురు స్టార్ ప్లేయర్లు టీమ్ ఇండియా జట్టులోకి పునరాగమనం చేయనున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా టీ20 సిరీస్ ఆడుతోంది. టీ20 సిరీస్‌లో భారత జట్టు 2-2తో సమంగా ఉంది. రోహిత్ ఈ నెల 23న బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరనున్నాడు. అక్కడ వారం రోజుల పాటు జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననున్నాడు. ఇక ఆసియాకప్ భారత జట్టును మరో రెండు రోజుల్లో బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది.