Rishabh Pant: స్విమ్మింగ్ పూల్ లో కర్ర సహాయంతో శ్రమిస్తున్న రిషబ్ పంత్.. వీడియో వైరల్?
టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ గురించి మనందరకీ తెలిసిందే.
- By Nakshatra Published Date - 08:09 PM, Wed - 15 March 23

Rishabh Pant: టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ గురించి మనందరకీ తెలిసిందే. రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్తూ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రమాదం నుంచి తొందరగా కోలుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇది వరకే ఆరు బయట నడుస్తున్న ఫోటోని షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా రిషబ్ పంత్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఆ వీడియోలో రిషబ్ పంత్ స్విమ్మింగ్ పూల్ లో చేతి కర్ర సాయంతో అటూ ఇటూ నడుస్తున్నాడు.
కాగా ఆ వీడియోని షేర్ చేస్తూ ఈ విధంగా కాప్షన్ ని కూడా రాసుకొచ్చాడు. చిన్న విషయాలు, పెద్ద విషయాలు, మధ్యలో జరుగుతున్న అన్నింటికీ నేను రుణపడి ఉన్నాను. వీటన్నింటిని ఒకే స్టెప్‌లో తీసుకుంటున్నా అనే క్యాప్షన్ ని కూడా జోడించాడు. ఆ వీడియోని బట్టి చూస్తుంటే రిషబ్ పంత్ తొందరగా కోలుకోవాలని గట్టిగానే శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదం తరువాత రిషబ్ పంత్ కీ ముంబైలో రెండు సర్జరీలు జరిగిన విషయం తెలిసిందే.
తర్వాత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను తన అభిమానులతో పంచుకుంటూనే ఉన్నాడు. అభిమానులు కూడా వీలైనంత తొందరగా రిషబ్ పంత్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. రిషబ్ పంత్ షేర్ చేసిన వీడియోలకు కామెంట్స్ చేస్తూ రిషబ్ పంత్ కి ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది.

Related News

IPL 2023: పంత్ లేకున్నా బలంగానే ఢిల్లీ
ఐపీఎల్ ప్రారంభమై 15 ఏళ్ళు పూర్తయినా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లు కొన్ని ఉన్నాయి. ఆ జాబితాలో చెప్పుకోవాల్సింది ఢిల్లీ క్యాపిటల్స్ గురించే..