Rishabh Pant: పంత్‌పై కీలక ప్రకటన చేసిన గంగూలీ.. ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి కెప్టెన్ ఎవరంటే..?
దాదాపు 14 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ IPL 2024లో తిరిగి వచ్చాడు. పంత్ మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడాన్ని అభిమానులు చూశారు.
- By Gopichand Published Date - 10:52 AM, Mon - 12 August 24

Rishabh Pant: క్రికెట్ ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న లీగ్ ఏదైనా ఉందని అంటే అది ఐపీఎల్ మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఐపీఎల్‌కు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అయితే IPL 2025 ప్రారంభానికి ముందు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) గురించి చాలా నివేదికలు వస్తున్నాయి. పంత్ రాబోయే IPL సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ను విడిచిపెట్టవచ్చని, 2025 సంవత్సరంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఈ వార్తలకు చాలా వరకు ముగింపు పలికారు.
‘పంత్ ఢిల్లీ తరఫున ఆడటం కొనసాగిస్తాడు’
దాదాపు 14 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ IPL 2024లో తిరిగి వచ్చాడు. పంత్ మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడాన్ని అభిమానులు చూశారు. ఈ సీజన్ పంత్‌కు బాగా కలిసొచ్చింది. ఇప్పుడు IPL 2025 మెగా వేలానికి ముందు పంత్ కొత్త సీజన్ నుండి ఢిల్లీ క్యాపిటల్స్‌కు వీడ్కోలు చెప్పవచ్చని నివేదికలు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read: Band Aid For Heart : గుండెకు బ్యాండ్ ఎయిడ్.. రెడీ చేసిన శాస్త్రవేత్తలు
వన్ ఇండియా బెంగాలీ కథనం ప్రకారం.. రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడటం కొనసాగిస్తాడని సౌరవ్ గంగూలీ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు నివేదిక పేర్కొంది. 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అయితే గత ఐపీఎల్‌లో జట్టును ఫైనల్స్ దాకా తీసుకెళ్లడంలో పంత్ విఫలమయ్యాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఐపీఎల్ 2024లో ఢిల్లీ ప్రదర్శన ఇలా ఉంది
ఐపిఎల్ 2024లో క్యాపిటల్స్ తమ 14 మ్యాచ్‌లలో ఏడింటిని మాత్రమే గెలవగలిగింది. దీని వల్ల రిషబ్ పంత్ నేతృత్వంలోని జట్టు టోర్నమెంట్ లీగ్ దశ నుండి నిష్క్రమించింది. ఇప్పుడు వచ్చే ఐపీఎల్ సీజన్‌లో జట్టు తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటోంది. అయితే పంత్ జట్టు మారతాడనే ఊహగానాలకు గంగూలీ ప్రకటనతో చెక్ పడినట్లేనని క్రీడా పండితులు అంటున్నారు. మరోవైపు ఐపీఎల్ వేలం ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న విషయం తెలిసిందే.