Ravi Shastri Comments: కోహ్లీ, రోహిత్ శర్మలపై రవిశాస్త్రి ఆసక్తికర కామెంట్స్..!
ప్రస్తుతం ఉన్న టీమిండియా బ్యాటింగ్ లైనప్ అత్యంత బలమైనదని.. నెంబర్ 5, 6 స్థానాల్లో హార్దిక్, కార్తీక్\పంత్ లాంటి ప్లేయర్స్ రావడం చాలా ప్రభావం చూపనుందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు.
- By Gopichand Published Date - 04:15 PM, Thu - 13 October 22

ప్రస్తుతం ఉన్న టీమిండియా బ్యాటింగ్ లైనప్ అత్యంత బలమైనదని.. నెంబర్ 5, 6 స్థానాల్లో హార్దిక్, కార్తీక్\పంత్ లాంటి ప్లేయర్స్ రావడం చాలా ప్రభావం చూపనుందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్ కొట్టాలంటే మాత్రం టీమిండియా ఫీల్డింగ్ పై దృష్టి పెట్టాల్సిందేనని చెప్పాడు.
ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబర్ 23న టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే మ్యాచ్ కీలక సమయాల్లో క్యాచ్‌లు జారవిడవటం ఆసియా కప్-2022 టోర్నీలో తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. రవిశాస్త్రి మాట్లాడుతూ.. టీమిండియా ముందుగా ఫీల్డింగ్ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవాల్సి ఉంది. శ్రమిస్తేనే ఫలితం. పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఫీల్డర్లు కాపాడే 15-20 పరుగులే మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేస్తాయని అన్నాడు.
ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై, బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్‌కు ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ కావొచ్చని, ఆ తర్వాత వారు ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు చెబుతారని రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే రవిశాస్త్రి కోచ్ గా, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో గతేడాది ప్రపంచకప్ ఆడిన టీమిండియా కనీసం సెమీస్ కూడా చేరకుండానే ఇంటికి చేరిన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం నుంచి టీ20 వరల్ట్ కప్ ప్రారంభకానున్న విషయం తెలిసిందే.