Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్ అప్పుడే… మహి మనసులో మాట చెప్పిన రైనా…
తాజాగా ధోనీ క్లోజ్ ఫ్రెండ్, మాజీ చెన్నై ప్లేయర్ సురేష్ రైనా (Suresh Raina) ఈ విషయంపై ఆసక్తికర విషయం వెల్లడించాడు. రిటైర్‌మెంట్ గురించి ధోనీతో మాట్లాడానని చెప్పాడు.
- Author : Naresh Kumar
Date : 09-05-2023 - 4:12 IST
Published By : Hashtagu Telugu Desk
Raina Drops Major Update : వరల్డ్ క్రికెట్ లోనే కాదు… ఐపీఎల్ లోనూ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) తనదైన ముద్ర వేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత ధోనీ ఐపీఎల్ లో కొనసాగుతూ ఫాన్స్ ను అలరిస్తున్నాడు. అయితే గత రెండేళ్లుగా ధోనీ (MS Dhoni) ఐపీఎల్ రిటైర్మెంట్ పై వార్తలు వస్తున్నాయి. పలు సందర్భాల్లో ధోనీ క్లారిటీ ఇచ్చినా ఈ వార్తలు మాత్రం ఆగలేదు. అయితే తన వీడ్కోలు మ్యాచ్ చెన్నైలోనే ఆడతానని ధోనీ చెప్పడంతో ఈ సారి సీజన్ ధోనీకి చివరిదదంటూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు ధోనీని చివరిసారి యాక్షన్‌లో చూసేందుకు స్టేడియానికి క్యూలు కడుతున్నారు.
తాజాగా ధోనీ క్లోజ్ ఫ్రెండ్, మాజీ చెన్నై ప్లేయర్ సురేష్ రైనా (Suresh Raina) ఈ విషయంపై ఆసక్తికర విషయం వెల్లడించాడు. రిటైర్‌మెంట్ గురించి ధోనీతో మాట్లాడానని చెప్పాడు. మరోసారి ట్రోఫీ గెలవాలని ఉందనీ, ఆ తర్వాత మరో సీజన్ ఆడతా అన్నట్టు చెప్పాడు. ఇదే విషయాన్ని రైనా (Raina) లైవ్‌లో వెల్లడించాడు. దీంతో ధోనీ రిటైర్‌మెంట్ వార్తలకు ఇప్పటికైనా ఫుల్‌స్టాప్ పడుతుందని ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. సీజన్ మధ్యలో
కూడా ధోనీ ఇదే విషయం చెప్పాడు. తను రిటైర్‌మెంట్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ తీసుకున్నా సీజన్ మధ్యలో అనవసర ప్రకటనలు చేసి ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టబోనని తేల్చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా మీకు ఇదే చివరి ఐపీఎల్ అనుకుంటా అని మహీని అడుగ్గా.. అది మీరు డిసైడ్ అయ్యారు నేను కాదు.. అంటూ ధోనీ చేసిన కామెంట్ కూడా వైరల్ గా మారింది. తాజాగా రైనా చెప్పిన మాటలతో చెన్నై ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ప్రస్తుత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
Also Read: Business Ideas: మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ ఐదు బిజినెస్ లు ట్రై చేయండి..!