T20 World Cup 2022: భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ కు వరణుడి ఆటంకం..!
T20 వరల్డ్‌కప్‌లో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు.
- By Gopichand Published Date - 04:33 PM, Wed - 2 November 22

T20 వరల్డ్‌కప్‌లో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. భారత్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ 59, హొస్సేస్ షాంటో ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో వర్షం పడటంతో మ్యాచ్‌ను అపివేశారు. డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం టీమిండియా కంటే బంగ్లాదేశ్ 17 రన్స్ ముందు ఉంది. వర్షం తగ్గితే మ్యాచ్ కొనసాగే అవకాశముంది.
తొలుత మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 184/6 స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 64*, కేఎల్ రాహుల్ 50, సూర్యకుమార్ 30 రన్స్ తో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ అహ్మద్ 3, షకీబ్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ లో గెలవాలంటే బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 185 రన్స్ చేయాలి.