Chennai vs Mumbai వాంఖేడే లోనూ చెన్నై చెడుగుడు.. ముంబై పై ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రెండో మ్యాచ్ లోనూ పరాజయం పాలైంది.
- By Naresh Kumar Published Date - 11:00 PM, Sat - 8 April 23
Chennai vs Mumbai IPLT20 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రెండో మ్యాచ్ లోనూ పరాజయం పాలైంది. వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్ కు 38 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే క్రమంలో రోహిత్ ఔటైనప్పటకీ.. ఇషాన్ కిషన్ జోరు కొనసాగించాడు.
అయితే పవర్ ప్లే తర్వాత ముంబై వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ 22 , కామెరూన్ గ్రీన్ 12, సూర్యకుమార్ యాదవ్ 2 పరుగులకే వెనుదిరిగారు.గత మ్యాచ్ లో అదరగొట్టిన తిలక్ వర్మ ఆదుకునేందుకు ప్రయత్నించాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్సర్ తో 22 పరుగులు చేసి ఔటవడంతో ముంబై మిగిలిన వికెట్లను కూడా వేగంగానే కోల్పోయింది.
.@ajinkyarahane88 came out all guns blazing with the bat tonight in Mumbai and he becomes our 🔝 performer of the second innings of the #MIvCSK clash in the #TATAIPL 👏🏻👏🏻
A look at his batting summary 🔽 pic.twitter.com/ZZQ9iC0UfV
— IndianPremierLeague (@IPL) April 8, 2023
చివర్లో టిమ్ డేవిడ్ 31 , హృతిక్ 18 పరుగులతో ధాటిగా ఆడడంతో స్కోర్ 150 దాటింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. చెన్నై (Chennai) బౌలర్లలో రవీంద్ర జడేజా అదరగొట్టాడు. జడేజా 3 , శాంట్నర్ 2 , తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు పడగొట్టారు. ఒకదశలో 200 వరకూ స్కోర్ చేస్తుందనుకున్న ముంబైని చెన్నై బౌలర్లు కట్టడి చేశారు.
.@imjadeja scalped a splendid three-wicket haul including a sharp catch off his own bowling and he becomes our 🔝 performer from the first innings of the #MIvCSK clash in the #TATAIPL 👌👌
A look at his bowling summary 🔽 pic.twitter.com/Dqadpfbaps
— IndianPremierLeague (@IPL) April 8, 2023
158 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓవర్ లోనే కాన్వే వికెట్ కోల్పోయింది. ఈ దశలో అజంక్య రహానే మెరుపు హాఫ్ సెంతరీతో అదరగొట్టాడు. ఊహించని విధంగా భారీ షాట్లతో చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ రెచ్చిపోయాడు. రహానే టీట్వంటీల్లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం చాలా అరుదు.
Impact Player @RayuduAmbati with the winning runs 💥
A 7⃣-wicket win in Mumbai for @ChennaiIPL 💛😎
Scorecard ▶️ https://t.co/rSxD0lf5zJ#TATAIPL | #MIvCSK pic.twitter.com/aK6Npl8auB
— IndianPremierLeague (@IPL) April 8, 2023
దీంతో స్టేడియంలో ప్రేక్షకులు అతని బ్యాటింగ్ ను ఆస్వాదించారు. రహానే 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. రహానే ఔటైనప్పటకీ.. రుతురాజ్ గైక్వాడ్ 36 బంతుల్లో 40 , శివమ్ దూబే 26 బంతుల్లో 28 రన్స్ చేశారు. చివర్లో అంబటి రాయుడు 16 బంతుల్లోనే 23 రన్స్ చేయడంతో చెన్నై 18.1 ఓవర్లలోనే టార్గెట్ అందుకుంది. ఈ సీజన్ లో చెన్నైకి ఇది రెండో విజయం. మరోవైపు ముంబై ఇండియన్స్ కు ఇది వరుసగా రెండో పరాజయం.
.@imjadeja claimed an economical three-wicket haul and bagged the Player of the Match award 👏🏻👏🏻@ChennaiIPL cliched a 7️⃣-wicket win in Mumbai 👌
Scorecard ▶️ https://t.co/rSxD0lf5zJ#TATAIPL | #MIvCSK pic.twitter.com/n5amK0Wm1Z
— IndianPremierLeague (@IPL) April 8, 2023
Also Read: IPLT20 2023 DRS : అందుకే DRS అంటే ధోనీ రివ్యూ సిస్టమ్
Tags
Related News
ICC Bans Devon Thomas: ఐసీసీ కఠిన చర్యలు.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం
వెస్టిండీస్ క్రికెటర్ డెవాన్ థామస్‌పై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించింది. ఈ 34 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇకపై ఎలాంటి క్రికెట్‌ను ఆడలేడు.