HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Piyush Chawla Gives Verdict On Rohit Sharma Captaincy

Rohit Sharma Leadership: రోహిత్ కెప్టెన్సీపై స్టార్ బౌలర్ క్రేజీ స్టేట్మెంట్

Rohit Sharma Leadership: రోహిత్ లీడర్షిప్ పై తాజాగా పీయూష్ చాలా గొప్పగా మాట్లాడాడు. రోహిత్ శర్మ కెప్టెన్ కాదు లీడర్ అన్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ , 2024 టి20ప్రపంచ కప్‌ రోహిత్ నాయకత్వం అద్భుతంగా ఉందన్నాడు. ఈ రెండు మెగా టోర్నీలో రోహిత్ బ్యాటింగ్ చేసిన విధానాన్ని లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో పోల్చారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 13-09-2024 - 6:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rohit Sharma Leadership
Rohit Sharma Leadership

Rohit Sharma Leadership: రోహిత్ శర్మ కెప్టెన్ కాదు హి ఈజ్ లీడర్. నిజమే కెప్టెన్ గా రోహిత్ (Rohit Sharma) టీమిండియాకు చాలానే చేశాడు. ఆటగాడిగా జట్టుకు తాను చేసిన కృషి ఎప్పటికి మర్చిపోలేం. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు రోహిత్ విధ్వంసం ఆటగాళ్లకు ధైర్యాన్నిస్తుంది. ఒకవైపు ఆటతీరుతో ఆకట్టుకుంటూ మరోవైపు జట్టును ముందుకు నడిపించడంలోనూ రోహిత్ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం రోహిత్ టీమిండియాకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. దీంతో రోహిత్ ని కెప్టెన్ గా మాత్రమే చూడలేం. ఆయనో లీడర్ కూడా.

రోహిత్ లీడర్షిప్ పై తాజాగా పీయూష్ చాలా గొప్పగా మాట్లాడాడు. రోహిత్ శర్మ కెప్టెన్ కాదు లీడర్ అన్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ , 2024 టి20ప్రపంచ కప్‌ రోహిత్ నాయకత్వం అద్భుతంగా ఉందన్నాడు. ఈ రెండు మెగా టోర్నీలో రోహిత్ బ్యాటింగ్ చేసిన విధానాన్ని లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో పోల్చారు. తోటి ఆటగాళ్లపై ఒత్తిడిని తగ్గించడానికి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటాడని చెప్పాడు. ఒకరోజు అర్ధరాత్రి రెండున్నర గంటలకు రోహిత్ పీయూష్ కు మెసేజ్ చేసి డేవిడ్ వార్నార్ ని ఎలా అవుట్ చేయాలో ప్లాన్ చెప్పినట్లు తాజాగా పీయూష్ గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు ఓ కాగితంపై ఫీల్డ్‌ను కూడా గీశాడట. ఆ సమయంలో రోహిత్ నిజమైన నాయకుడిగా కనిపించాడని పీయూష్ చావ్లా అన్నాడు. కాగా రోహిత్ పై పీయూష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

2023 ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున పీయూష్ చావ్లా అద్భుత ప్రదర్శన చేశాడు. 16 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మతో కలిసి పీయూష్ చావ్లా ఆడాడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో చావ్లా కూడా ఉన్నాడు.

Also Read: Team India Unlucky Players: టీమిండియాలో దురదృష్టానికి కేరాఫ్ వాళ్లిద్దరే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • captain
  • Captaincy
  • cricket news
  • Leader
  • Piyush Chawla
  • rohit sharma
  • Sports Updates
  • team india

Related News

BCCI Issues Key Directives to Hardik and Rohit

BCCI: హార్దిక్‌, రోహిత్‌లకు బీసీసీఐ కీలక ఆదేశాలు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక కీలక నిర్ణయంతో టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలపై కఠిన వైఖరిని ప్రదర్శించింది. త్వరలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ముందు, వీరిద్దరినీ తక్షణమే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరానికి రిపోర్ట్ చేయాలని బోర్డు ఆదేశించింది. రాబోయే సిరీస్ కోసం ఆటగాళ్ల ఫిట్‌నెస్, సంస

    Latest News

    • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

    • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

    • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd