Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్.. సరికొత్త రికార్డు సృష్టించిన భారత్ జట్టు..!
మంగళవారం మహిళల 400 మీటర్ల రేసు (టీ20 కేటగిరీ)లో దీప్తి జివాన్‌జీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీప్తి 55.07 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పారా అథ్లెటిక్స్‌లోనే భారత్‌కు మరో నాలుగు పతకాలు వచ్చాయి.
- By Gopichand Published Date - 10:32 AM, Wed - 4 September 24
Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించారు. మంగళవారం భారత్ 5 పతకాలు సాధించడంతో పట్టికలో మొత్తం 20 పతకాలను చేర్చుకుంది. ఇది ఏదైనా ఒక పారాలింపిక్ (Paris Paralympics 2024) క్రీడలలో దాని కొత్త రికార్డు. మంగళవారం దీప్తి జీవన్ జీ, శరద్ కుమార్, అజిత్ సింగ్, మరియప్పన్ తంగవెల్లు, సుందర్ సింగ్ గుర్జార్ భారత్‌కు పతకాలు సాధించిపెట్టారు. ఇంతకుముందు టోక్యో పారాలింపిక్ గేమ్స్ 2020లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. టోక్యోలో భారత జట్టు 19 పతకాలతో పునరాగమనం చేయగా.. పారిస్‌లో మాత్రం భారత జట్టు ఆ సంఖ్యను అధిగమించి 3 బంగారు పతకాలు, 7 రజత పతకాలు, 10 కాంస్య పతకాలతో సరికొత్త రికార్డు సృష్టించింది.
ఇదీ మంగళవారం భారత్ ప్రదర్శన
మంగళవారం మహిళల 400 మీటర్ల రేసు (టీ20 కేటగిరీ)లో దీప్తి జివాన్‌జీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీప్తి 55.07 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పారా అథ్లెటిక్స్‌లోనే భారత్‌కు మరో నాలుగు పతకాలు వచ్చాయి. పురుషుల జావెలిన్ త్రో (ఎఫ్ 46 కేటగిరీ)లో అజిత్ సింగ్ 65.62 మీటర్లు విసిరి రజత పతకాన్ని గెలుచుకోగా, అతని సహచరుడు సుందర్ సింగ్ గుర్జార్ 64.96 మీటర్ల త్రోతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. పురుషుల హైజంప్ (టీ63 కేటగిరీ) ఫైనల్లో టోక్యో పారాలింపిక్ గేమ్స్ కాంస్య పతక విజేత టి.శరద్ కుమార్ 1.88 మీటర్లు జంప్ చేసి రజత పతకాన్ని గెలుచుకోగా, మరియప్పన్ తంగవేలు 1.85 మీటర్లు దూకి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
Also Read: Teachers Day 2024 : ఉపాధ్యాయ దినోత్సవం.. సర్వేపల్లి రాధాకృష్ణన్ కెరీర్‌లోని స్ఫూర్తిదాయక విశేషాలివీ
భారతదేశం పతకాలు 25 కంటే ఎక్కువ ఉండవచ్చు
పారిస్ పారాలింపిక్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య మరింత పెరగవచ్చు. ఎందుకంటే టోక్యో గేమ్స్‌తో పోలిస్తే ఈసారి భారత్ మరో 3 విభాగాల్లో అథ్లెట్లను రంగంలోకి దించింది. 84 మంది పారా అథ్లెట్లతో పారిస్ పారాలింపిక్స్‌కు చేరిన భారత్‌కు చివరి రోజైన సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఇంకా ఎన్నో పతకాలు సాధించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సాధించిన 20 పతకాల్లో భారత్‌కు పారా బ్యాడ్మింటన్‌లో 5, షూటింగ్‌లో 4, ఆర్చరీలో ఒక పతకం లభించింది. కాగా మిగిలిన అన్ని పతకాలు పారా అథ్లెటిక్స్‌లో వచ్చాయి. పారిస్ ఒలింపిక్ క్రీడలు – 2024లో భారత అథ్లెట్లు నిరాశపరిచిన తర్వాత పారా అథ్లెట్ల ఈ బలమైన ప్రదర్శన క్రీడా ప్రేమికులకు ఖచ్చితంగా ఓదార్పునిచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
Related News
Priyansh Arya: ఆర్సీబీపై కన్నేసిన సిక్సర్ల కింగ్ ప్రియాంష్ ఆర్య
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ప్రియాంష్ ఆర్య అద్భుతమైన ఆటతీరుతో ఆశ్చర్యపరిచాడు. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ మరియు నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రియాంష్ ఆర్య 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. కాగా తాజాగా ఈ యువకెరటం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడాలనే కోరికను వ్యక్తం చేశాడు