Teachers Day 2024 : ఉపాధ్యాయ దినోత్సవం.. సర్వేపల్లి రాధాకృష్ణన్ కెరీర్‌లోని స్ఫూర్తిదాయక విశేషాలివీ
Teachers Day 2024 రాధాకృష్ణన్ కెరీర్ ఉపాధ్యాయుడిగా మొదలైంది. అప్పట్లో అన్నం తినడానికి ప్లేటు కొనే స్తోమత కూడా ఆయనకు లేదు.
- By Pasha Published Date - 10:29 AM, Wed - 4 September 24
Teachers Day 2024 : రేపు (సెప్టెంబర్ 5న) మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజునే ఏటా మనం ఉపాధ్యాయ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప ఉపాధ్యాయుడు. ఆయన ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును 1954లో అందుకున్నారు. సర్వేపల్లి 16 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొందరు విద్యార్థులు, ఆయన మిత్రులు సెప్టెంబర్ 5న ఆయన పుట్టినరోజు వేడుకలకు నిర్వహించేందుకు అనుమతించాలని కోరారు. అయితే ఆయన ఆరోజున తన పుట్టినరోజుకు బదులు ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని సూచించారు. అప్పటి నుంచి ఏటా రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం(Teachers Day 2024) నిర్వహిస్తున్నాం. శ్రీకృష్ణుడిని గురువుగా, అర్జునుడిని శిష్యుడిగా పిలుస్తుంటాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పేవారు.
We’re now on WhatsApp. Click to Join
రాధాకృష్ణన్ కెరీర్ ఉపాధ్యాయుడిగా మొదలైంది. అప్పట్లో అన్నం తినడానికి ప్లేటు కొనే స్తోమత కూడా ఆయనకు లేదు. దీంతో అరిటాకులపై భోజనం చేసేవారు. ఒక్కోసారి అరిటాకులు కొనడానికి డబ్బులు లేకపోతే నేల గచ్చును నీటితో శుభ్రం చేసుకుని, దానిపై అన్నం వడ్డించుకొని తినేవారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి ఆయనకు తనకు వచ్చిన మెడల్స్‌ను కూడా అమ్ముకోవాల్సిన బ్యాడ్ టైం ఎదురైంది. అయినా ఆయన ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగి భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు.
Also Read :Rs 22000 Crore Scam : డబ్బులు డబుల్.. రూ.22వేల కోట్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్ వెలుగులోకి!
రాష్ట్రపతి కావడానికి ముందు ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో 1909లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ కళాశాల, మైసూరు, కలకత్తా విశ్వవిద్యాలయాల్లో తత్వశాఖ అధ్యక్షులుగా సేవలు అందించారు. 1929లో మాంచెస్టర్ కాలేజీలో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. అనంతరం ఆయన భారతదేశం తిరిగివచ్చి 1931 నుంచి 1936 వరకు ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా వ్యవహరించారు. తదుపరిగా 1948 జనవరి వరకు బనారస్ హిందూ యూనివర్సిటీలో వైస్ ఛాన్స్‌లర్‌గా సేవలు అందించారు.
Also Read :Telangana Rains : భద్రాచలం గోదావరి నీటిమట్టం 43 అడుగులు.. ఈ జిల్లాలకు వర్షసూచన
Related News
Teacher’s Day 2024: 82 మంది ఉపాధ్యాయులను సన్మానించనున్న రాష్ట్రపతి
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజ్ఞాన్ భవన్లో ఎంపికైన 82 మంది ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అవార్డు 2024తో సత్కరించనున్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.