HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Pakistan Withdraws From The Match Against India

భారత్‌తో మ్యాచ్‌కు పాక్ దూరం

  • Author : Vamsi Chowdary Korata Date : 05-02-2026 - 10:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pakistan PM Shehbaz Sharif Reaffirms Boycott Stance
Pakistan PM Shehbaz Sharif Reaffirms Boycott Stance

IND VS PAK  టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో తలపడే విషయంపై  కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెరదించారు. ఫిబ్రవరి 15న శ్రీలంక వేదికగా జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్‌పై ఆయన తన మౌనాన్ని వీడుతూ పాకిస్థాన్ వైఖరిని స్పష్టం చేశారు. బుధవారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.

“భారత్‌తో మ్యాచ్ ఆడకూడదని మేము ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకున్నాం. ఇది ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు, అన్ని కోణాల్లో క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు. ప్రస్తుతం మేము బంగ్లాదేశ్‌కు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాం” అని షరీఫ్ పేర్కొన్నారు.

భారత్‌లో భద్రతా కారణాల వల్ల తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ కోరగా, ఐసీసీ అందుకు నిరాకరించింది. ఫలితంగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో వారి స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చారు. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్ ప్రభుత్వం, బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది.

పాక్ ప్రధాని వ్యాఖ్యలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఘాటుగా స్పందించింది. వరల్డ్ కప్ లాంటి అంతర్జాతీయ టోర్నీల్లో జట్లు తమకు నచ్చిన మ్యాచ్‌లే ఆడతామనడం కుదరదని ఐసీసీ స్పష్టం చేసింది. ఒకవేళ పాక్ గనుక మ్యాచ్‌ను బహిష్కరిస్తే, పీసీబీకి వచ్చే వార్షిక ఆదాయంలో కోత విధించడంతో పాటు, భవిష్యత్తులో ఐసీసీ టోర్నీల నిర్వహణ హక్కులను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానుల ప్రయోజనాలను దెబ్బతీయొద్దని హితవు పలికింది.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక జట్టు షెడ్యూల్ ప్రకారం మైదానంలోకి రాకపోతే, ప్రత్యర్థి జట్టుకు వాకోవర్ లభిస్తుంది. అంటే, భారత్ ఆడకుండానే 2 పాయింట్లు సాధిస్తుంది. అయితే, క్రికెట్ ప్రపంచంలో అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ మ్యాచ్ రద్దు కావడం బ్రాడ్‌కాస్టర్లకు, ఐసీసీకి కోలుకోలేని దెబ్బే. ప్రస్తుతానికి పాక్ జట్టు శ్రీలంక చేరుకున్నప్పటికీ, ఫిబ్రవరి 15న వారు భారత్‌తో తలపడతారా లేదా అన్నది ఇంకా ఉత్కంఠగానే ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICC Cricket News
  • ICC T20 World Cup 2026
  • ind vs pak
  • Pakistan Cricket Board (PCB)
  • Pakistan PM Shehbaz Sharif
  • T20 World Cup 2026
  • TeamIndia

Related News

Sunil Gavaskar

సెమీస్ ముందు ఇండియాకు గ‌వాస్క‌ర్ వార్నింగ్

Sunil Gavaskar  టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఎల్లుండి ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా సాగుతుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. అయితే, జస్‌ప్రీత్ బుమ్రా వంటి అద్భుతమైన బౌలర్ ఉండటం, బ్యాటింగ్ ఆర్డర్‌లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ కారణంగా ఆతిథ్య టీమిండియాకే స్వల్పంగా గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్

  • Mohammad Amir

    టీమిండియాపై మళ్లీ నోరుపారేసుకున్న ఆమిర్!

  • T20 World Cup 2026

    సెమీఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంటుందా?

  • T20 World Cup 2026

    మరికాసేప‌ట్లో టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌.. వెద‌ర్ రిపోర్ట్ ఇదే!

  • Shivam Dube

    2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

Latest News

  • Blenders Pride : బ్లెండర్స్ ప్రైడ్ నుండి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్

  • Escorts Kubota Limited : దక్షిణాది రైతుల కోసం ఎస్కార్ట్స్ కుబోటా సరికొత్త ట్రాక్టర్ విడుదల

  • సోషల్ మీడియా క్రియేటర్ల శ్రమను దోచుకుంటున్నారు: విజయసాయిరెడ్డి

  • Mini Maldives : తెలంగాణలో మినీ మాల్దీవులు ఉన్నాయని మీకు తెలుసా ?

  • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలి.. చైనా వార్నింగ్ !

Trending News

    • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

    • శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

    • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

    • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

    • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd