HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Pakistan Pacer Shaheen Afridi Scripts History

Shaheen Afridi: చరిత్ర సృష్టించిన షాహిన్ అఫ్రిది

షాహీన్ తన బౌలింగ్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో షాహీన్ అఫ్రిది తన పాత వైభవాన్ని చూపించాడు. వేగంతో పాటు స్వింగ్‌లో బౌన్స్ కూడా కనిపించింది.

  • Author : Gopichand Date : 12-12-2024 - 9:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shaheen Afridi
Shaheen Afridi

Shaheen Afridi: పాకిస్థాన్ స్టార్ బౌల‌ర్ షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) చ‌రిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్ల‌లో 100 వికెట్లు పడగొట్టిన పాకిస్థాన్ తొలి బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత అందుకున్న నాలుగో బౌలర్‌గా షాహిన్ అఫ్రిది రికార్డులకెక్కాడు. అతని కంటే ముందు న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథి, బంగ్లాదేశ్ బౌలర్ షకిబ్ అల్ హసన్, శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ ఈ ఫీట్ సాధించారు. అయితే షాహీన్ చిన్న వయసులోనే ఈ రికార్డును నెలకొల్పాడు. 24 ఏళ్ల 248 రోజుల వయస్సులో షాహిన్ మూడు ఫార్మాట్లలో 100 వికెట్ల మార్క్‌ సాధించాడు. టిమ్ సౌథి 32 ఏళ్ల 319 రోజుల వయస్సులో త్రీ ఫార్మెట్స్ లో హండ్రెడ్ వికెట్స్ తీశాడు.

షాహీన్ తన బౌలింగ్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో షాహీన్ అఫ్రిది తన పాత వైభవాన్ని చూపించాడు. వేగంతో పాటు స్వింగ్‌లో బౌన్స్ కూడా కనిపించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయలేకపోవడానికి ఇదే కారణం. షాహీన్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికాపై మూడో వికెట్‌ తీసిన షహీన్‌ అంతర్జాతీయ టీ20లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అఫ్రిది తన 74వ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

Also Read: Judge Vs India Bloc : ‘‘హిందుస్తాన్’’ వ్యాఖ్యలు.. హైకోర్టు జడ్జిపై ‘ఇండియా’ కూటమి అభిశంసన తీర్మానం

షాహీన్ అఫ్రిది తన కెరీర్‌ను 2018లో ప్రారంభించాడు. అతను ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాన స్ట్రైక్ బౌలర్. ఇప్పటి వరకు 31 టెస్టుల్లో 116 వికెట్లు, 56 వన్డేల్లో 112 వికెట్లు, 74 టీ20ల్లో 100 వికెట్లు పడగొట్టాడు. టీ20లో రెండుసార్లు 4 వికెట్లు తీశాడు. అయితే ఇటీవలి కాలంలో షాహీన్ ఫామ్ తగ్గుముఖం పట్టింది. అతడ్ని టెస్ట్ ఫార్మాట్ నుండి తొలగించబడటానికి ఇదే కారణం. అయితే దక్షిణాఫ్రికాపై చూపించిన బౌలింగ్‌ను కొనసాగించగలిగితే అతడ్ని త్వరలో టెస్ట్ ఫార్మాట్‌లోకి కూడా తీసుకోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket news
  • pakistan
  • SA vs PAK
  • Shaheen Afridi
  • South Africa vs Pakistan 2024
  • sports news

Related News

Srh Vs Rcb

IPL 2026: ఐపీఎల్ 2026..తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ X ఆర్సీబీ

SRH vs RCB  ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచులో మార్చి 28 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఐపీఎల్ 2026లో ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. ఐపీఎల్ 2026 ప్రాథమిక షెడ్యూల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించి నాలుగు మ్యాచులు ఉన్నాయి. ఇందులో ఏప్రిల్ 5న ఉప్పల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్ రైజర్స్ తలపడనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు సంబంధించిన ష

  • Bcci Col Ck Nayudu Lifetime Achievement Award

    బీసీసీఐ గురుశిష్యులకు అరుదైన గౌరవం..

  • The Hundred Women 2026

    ది హండ్రెడ్ ఉమెన్స్ లీగ్‌లో టీమిండియా ప్లేయర్లపై కనకవర్షం

  • Ishan Kishan

    ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • IPL 2026

    ఐపీఎల్ 2026 షెడ్యూల్‌.. కీలక విషయాలివే!

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd