Shaheen Afridi: చరిత్ర సృష్టించిన షాహిన్ అఫ్రిది
షాహీన్ తన బౌలింగ్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో షాహీన్ అఫ్రిది తన పాత వైభవాన్ని చూపించాడు. వేగంతో పాటు స్వింగ్‌లో బౌన్స్ కూడా కనిపించింది.
- By Gopichand Published Date - 09:45 AM, Thu - 12 December 24

Shaheen Afridi: పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన పాకిస్థాన్ తొలి బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత అందుకున్న నాలుగో బౌలర్‌గా షాహిన్ అఫ్రిది రికార్డులకెక్కాడు. అతని కంటే ముందు న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథి, బంగ్లాదేశ్ బౌలర్ షకిబ్ అల్ హసన్, శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ ఈ ఫీట్ సాధించారు. అయితే షాహీన్ చిన్న వయసులోనే ఈ రికార్డును నెలకొల్పాడు. 24 ఏళ్ల 248 రోజుల వయస్సులో షాహిన్ మూడు ఫార్మాట్లలో 100 వికెట్ల మార్క్ సాధించాడు. టిమ్ సౌథి 32 ఏళ్ల 319 రోజుల వయస్సులో త్రీ ఫార్మెట్స్ లో హండ్రెడ్ వికెట్స్ తీశాడు.
షాహీన్ తన బౌలింగ్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో షాహీన్ అఫ్రిది తన పాత వైభవాన్ని చూపించాడు. వేగంతో పాటు స్వింగ్‌లో బౌన్స్ కూడా కనిపించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయలేకపోవడానికి ఇదే కారణం. షాహీన్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికాపై మూడో వికెట్ తీసిన షహీన్ అంతర్జాతీయ టీ20లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అఫ్రిది తన 74వ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
Also Read: Judge Vs India Bloc : ‘‘హిందుస్తాన్’’ వ్యాఖ్యలు.. హైకోర్టు జడ్జిపై ‘ఇండియా’ కూటమి అభిశంసన తీర్మానం
షాహీన్ అఫ్రిది తన కెరీర్‌ను 2018లో ప్రారంభించాడు. అతను ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాన స్ట్రైక్ బౌలర్. ఇప్పటి వరకు 31 టెస్టుల్లో 116 వికెట్లు, 56 వన్డేల్లో 112 వికెట్లు, 74 టీ20ల్లో 100 వికెట్లు పడగొట్టాడు. టీ20లో రెండుసార్లు 4 వికెట్లు తీశాడు. అయితే ఇటీవలి కాలంలో షాహీన్ ఫామ్ తగ్గుముఖం పట్టింది. అతడ్ని టెస్ట్ ఫార్మాట్ నుండి తొలగించబడటానికి ఇదే కారణం. అయితే దక్షిణాఫ్రికాపై చూపించిన బౌలింగ్‌ను కొనసాగించగలిగితే అతడ్ని త్వరలో టెస్ట్ ఫార్మాట్‌లోకి కూడా తీసుకోవచ్చు.