Pakistan: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 1965 తర్వాత టెస్టు ర్యాంకింగ్స్‌లో దిగజారిన పాక్..!
1965 తర్వాత టెస్టు ర్యాంకింగ్ పట్టికలో పాకిస్థాన్‌కు ఇదే అత్యల్ప రేటింగ్ పాయింట్. తాజా ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌కు ఇప్పుడు 76 రేటింగ్ పాయింట్లు లభించాయి.
- By Gopichand Published Date - 11:13 AM, Wed - 4 September 24
Pakistan: ఇటీవల పాకిస్థాన్- బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ జరిగింది. దీంతో పాకిస్థాన్ 2-0 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ పాక్ జట్టు (Pakistan) చాలా నష్టపోయింది. 1965 తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు ఇంత దారుణంగా దిగజారడం ఇదే తొలిసారి. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు ఇప్పుడు వెస్టిండీస్ కంటే దిగువకు పడిపోయింది. పాకిస్థాన్ రెండు స్థానాలు కోల్పోయింది.
పాకిస్థాన్ జట్టు 8వ స్థానానికి చేరుకుంది
బంగ్లాదేశ్‌పై ఓటమి తర్వాత ఇప్పుడు పాకిస్థాన్ ర్యాంకింగ్స్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఐసీసీ తన తాజా టెస్టు జట్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో పాకిస్థాన్ రెండు స్థానాలు దిగజారి ఎనిమిదో స్థానానికి చేరుకుంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టు ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉంది. కానీ ఈ సిరీస్‌లో జట్టు చాలా పేలవమైన ప్రదర్శనను కనబరిచింది. దాని కారణంగా జట్టు పరిస్థితి 8వ స్థానానికి పడిపోయింది.
Also Read: Indian Migrants: అక్రమ శరణార్థుల జనాభాలో భారతీయులకు మూడవ స్థానం.. రూ. 80 లక్షల వరకు వసూలు..!
1965 తర్వాత పాకిస్థాన్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది
1965 తర్వాత టెస్టు ర్యాంకింగ్ పట్టికలో పాకిస్థాన్‌కు ఇదే అత్యల్ప రేటింగ్ పాయింట్. తాజా ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌కు ఇప్పుడు 76 రేటింగ్ పాయింట్లు లభించాయి. పాకిస్థాన్ ఓడిపోగా.. శ్రీలంక, వెస్టిండీస్ జట్లు లాభపడ్డాయి. శ్రీలంక జట్టు ఆరో స్థానానికి, వెస్టిండీస్ జట్టు ఏడో స్థానానికి చేరుకున్నాయి.
రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్ ఓడిపోయింది
ఈ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించింది. సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లు రావల్పిండిలో జరిగాయి. తొలి టెస్టులో 10 వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్ పేలవంగా ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
బంగ్లాదేశ్ జట్టు 9వ స్థానంలో కొనసాగుతోంది
పాకిస్థాన్‌ను ఓడించిన బంగ్లాదేశ్ జట్టు ర్యాంకింగ్ 66 పాయింట్లకు చేరుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 124 పాయింట్లతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, 120 పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది.
Related News
Monkeypox Case : పాకిస్తాన్ లో 5 కు చేరిన మంకీ పాక్స్ కేసులు
ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు ఈ కేసులు పెరుగుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ అయ్యింది