Pakistan Cricketer Car Accident: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మహిళా క్రికెటర్లు
కారు ప్రమాదంలో పాకిస్తాన్ క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. కెప్టెన్ బిస్మా మరూఫ్ మరియు లెగ్ స్పిన్నర్ గులాం ఫాతిమా గాయపడటంతో పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది.
- Author : Praveen Aluthuru
Date : 06-04-2024 - 5:13 IST
Published By : Hashtagu Telugu Desk
Pakistan Cricketer Car Accident: కారు ప్రమాదంలో పాకిస్తాన్ క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. కెప్టెన్ బిస్మా మరూఫ్ మరియు లెగ్ స్పిన్నర్ గులాం ఫాతిమా గాయపడటంతో పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఇద్దరు ఆటగాళ్లకు స్వల్ప గాయాలైనట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ధృవీకరించింది. ప్రమాదం జరిగిన వెంటనే మరూఫ్, ఫాతిమాలను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ స్టార్ క్రికెటర్లు పిసిబి వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు.
స్వదేశంలో కీలక సిరీస్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. మూడు ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ వన్డేలు మరియు ఐదు టి220 మ్యాచ్‌ల సిరీస్ కోసం వెస్టిండీస్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది చివర్లో బంగ్లాదేశ్‌లో జరగనున్న ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్‌కు సన్నాహాల్లో భాగంగా ఈ మ్యాచ్‌లు పాకిస్థాన్‌కు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఈ సమయంలో ఇద్దరు ఆటగాళ్లు గాయపడడంతో పాక్ జట్టుకు ఇబ్బందులు తలెత్తాయి.
We’re now on WhatsApp. Click to Join
కారు ప్రమాదంలో గాయం కారణంగా ఏప్రిల్ 18 నుండి ప్రారంభమయ్యే సిరీస్‌లో వాళ్లిద్దరూ పాల్గొనడంపై ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇద్దరు ఆటగాళ్లు త్వరగా కోలుకోవాలని అభిమానులు, పీసీబీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బిస్మా మరియు గులాం ఫాతిమా పాకిస్థాన్ జట్టుకు కీలకం.
Also Read: Parenting Tips: పిల్లలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే ఈ సమస్యల బారిన పడ్డట్టే!