Olympics Covid Cases: పారిస్ ఒలింపిక్స్‌లో 40 మందికిపైగా అథ్లెట్లకు కరోనా
పారిస్ ఒలింపిక్స్‌లో కొవిడ్-19 కలకలం రేపుతోంది. దాదాపు 40 మంది క్రీడాకారులకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు WHO రిపోర్టుల్లో తేలింది.
- By Gopichand Published Date - 09:16 PM, Tue - 6 August 24
Olympics Covid Cases: కరోనా రెండేళ్ల క్రితం వణికించిన కరోనా మహమ్మారి వైరస్ (Olympics Covid Cases) మరోసారి విజృంభించే అవకాశం కన్పిస్తుంది. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో కరోనా కలకలం సృష్టిస్తుంది. ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు ఏకంగా 40 మందికి పైగా అథ్లెట్లకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. అయితే వారి పేర్లను బహిర్గతం మాత్రం చేయలేదు. దీంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజెషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మరోసారి ప్రపంచ వ్యాప్తంగా సోకే అవకాశం ఉందని తెలిపింది. గతంలో కోవిడ్ పాజిటివ్ వస్తే సదరు అథ్లెట్లను టోర్నీ నుంచి తొలగించారు. కానీ ఈసారి అలాంటి నియమాలు ఏమీ లేవు. దీంతో ఒక్కరి నుంచి మరొకరికి సోకి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: Amazon India: అమెజాన్‌కు బిగ్ షాక్.. కీలక వ్యక్తి రాజీనామా..!
పారిస్ ఒలింపిక్స్‌లో కొవిడ్-19 కలకలం రేపుతోంది. దాదాపు 40 మంది క్రీడాకారులకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు WHO రిపోర్టుల్లో తేలింది. బ్రిటిష్ స్విమ్మర్ ఆడమ్ పీటీ, ఆస్ట్రేలియా రన్నర్ లానీ పాలిస్టర్ తదితరులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఒలింపిక్స్ ముగింపునకు మరికొన్ని రోజులు ఉండటంతో కేసుల సంఖ్య పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ 2024 పతకాల పట్టికలో చైనా మొదటి స్థానంలో, అమెరికా రెండవ స్థానంలో ఉన్నాయి. అథ్లెట్లకు కోవిడ్-19 సోకినట్లు వార్తలు వస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న 40 మందికి పైగా అథ్లెట్లకు కరోనా సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆగస్టు 6 (మంగళవారం) వెల్లడించింది. పారిస్ ఒలింపిక్స్‌లో కోవిడ్ -19 కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం WHOని ఆందోళనకు గురిచేసింది. ఎందుకంటే కరోనా వైరస్ ఇంకా వ్యాప్తి చెందుతుందని WHO తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join.
బ్రిటీష్ స్విమ్మర్ ఆడమ్ పీటీ 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న ఒక రోజు తర్వాత అస్వస్థతకు గురైన తర్వాత కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించారు. ఇందులో అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇది కాకుండా ఆస్ట్రేలియా అథ్లెట్ లైనీ పాలిస్టర్ కూడా అనారోగ్యానికి గురై మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టైల్ నుండి వైదొలిగింది. AFP నివేదిక ప్రకారం.. 84 దేశాల నుండి సేకరించిన డేటా గత కొన్ని వారాల్లో కోవిడ్ -19 కోసం పాజిటివ్ పరీక్షిస్తున్న వ్యక్తుల శాతం గణనీయంగా పెరిగింది.
Related News
Moeen Ali Retire: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మొయిన్ అలీ..!
నేను ఈ నెలలో ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఇప్పుడు తరువాతి తరానికి సమయం ఆసన్నమైంది. నేను రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇదే సరైన సమయమని నేను భావించాను. నా పని నేను చేసాను అని చెప్పుకొచ్చాడు.