ICC Cricket T20 World Cup 2022: ఉత్కంఠ పోరులో యూఏఈపై నెదర్లాండ్స్ విజయం..!
T20 వరల్డ్ కప్ పెను సంచలనంతో ఆరంభమైన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన క్వాలిఫైయింగ్ టోర్నీ రెండో మ్యాచ్ లో యూఏఈ (United Arab Emirates)పై నెదర్లాండ్స్ విజయం సాధించింది.
- By Gopichand Published Date - 06:18 PM, Sun - 16 October 22

T20 వరల్డ్ కప్ పెను సంచలనంతో ఆరంభమైన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన క్వాలిఫైయింగ్ టోర్నీ రెండో మ్యాచ్ లో యూఏఈ (United Arab Emirates)పై నెదర్లాండ్స్ విజయం సాధించింది. 2వ మ్యాచ్ కూడా చివరి వరకు ఉత్కంఠగా సాగింది. 3 వికెట్ల తేడాతో యూఏఈపై నెదర్లాండ్స్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటింగ్ లో ఓపెనర్ వసీం (41) పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్సమెన్ ఎవరు 20 పరుగులు కూడా చేయలేకపోయారు. నెదర్లాండ్స్ బౌలింగ్ లో బాస్ డి లీడే 3 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఫ్రెడ్ క్లాస్సన్ 2 వికెట్లు, వాన్ డెర్ మెర్వే, టిమ్ ప్రింగిల్ చెరో వికెట్ తీశారు.
అనంతరం 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. నెదర్లాండ్స్ జట్టు బ్యాటింగ్ లో ఓపెనర్లు Max ఒదౌడ్ (23),విక్రంజిత్ సింగ్ (10) పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ఏ బ్యాట్సమెన్ మంచి ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో గెలుపు నెదర్లాండ్స్ ను వరించింది. యూఏఈ బౌలింగ్ లో జునైద్ సిద్దిక్యూ 3 వికెట్లు తీశాడు.